వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు అసాంజేకు విముక్తి

వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజేకు విముక్తి లభించింది. ఆయనను విడిచిపెట్టాలని అమెరికా కోర్టు తీర్పు వెలువరించింది.

వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు అసాంజేకు విముక్తి
X

సుమారు 14 ఏళ్ల పోరాటం తర్వాత వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజేకు విముక్తి లభించింది. అమెరికా సైనిక రహస్యాలను ప్రచురించడం ద్వారా గూఢచర్యానికి పాల్పడినాడనే ఆరోపణలను అసాంజే ఎదుర్కొంటూ..ఇంతకాలం బ్రిటన్‌లో తలదాచుకున్న ఆయనను విడిచిపెట్టాలని అమెరికా కోర్టు తీర్పు వెలువరించింది.

ఉత్తర మారియానా ద్వీపం రాజధాని సైపన్‌ కోర్టులో జరిగిన విచారణకు అసాంజే హాజరయ్యాడు. అంతకుముందు అమెరికా న్యాయ విభాగంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గూఢచర్యం చట్టానికి విరుద్ధంగా, జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందడం, వ్యాప్తి చేయడం వంటి నేరాలకు పాల్పడినట్టు అసాంజే అంగీకరించాడు. భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగంగానే ఇదంతా చేసినట్లు పేర్కొన్నాడు. అయితే గూఢ చట్టానికి విరుద్ధమన్నాడు.

అసాంజే నేర అంగీకారానికి యూఎస్‌ఏ డిస్ట్రిక్ట్‌ చీఫ్‌ జడ్జి రమోనా వి. మంగ్లోనా ఆమోదం తెలిపారు. ఇప్పటికే బ్రిటన్‌లో గడిపిన నిర్బంధ కాలాన్నిశిక్షగా పరిగణిస్తూ.. ఎలాంటి అదనపు జైలు శిక్ష విధించకుండా అసాంజేను విడుదల చేయాలని తీర్పు వెలువరించారు. ఈ నేపథ్యంలో జైలు నుంచి విడుదలైన అసాంజే తన స్వదేశమైన ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు.

Raju

Raju

Writer
    Next Story