15-20 ఏళ్ల తర్వాత అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేయడమేంటి? హైకోర్టు

ప్రదీప్‌రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. హైడ్రా కూల్చివేతల తీరును హైకోర్టు ప్రశ్నించారు.

15-20 ఏళ్ల తర్వాత అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేయడమేంటి? హైకోర్టు
X

జన్వాడ్‌ ఫాంహౌస్‌ కూల్చవద్దంటూ ప్రదీప్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. హైడ్రాకు ఉన్న పరిధుల గురించి చెప్పాలని అదనపు అడ్వకేట్‌ జనరల్‌ (ఏఏజీ) కి హైకోర్టు సూచించింది. హైడ్రా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని చెప్పిన ఏఏజీ. ఈ సందర్భంగా హైడ్రా కూల్చివేతల తీరును హైకోర్టు ప్రశ్నించింది. స్థల యజమానులు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేసుకుంటారని, స్థానిక సంస్థల అనుమతితో నిర్మాణాలు జరుగుతాయని హైకోర్టు పేర్కొన్నది. 15-20 ఏళ్ల తర్వాత అక్రమ నిర్మాణమని కూల్చివేయడమేంటని హైకోర్టు ప్రశ్నించింది.

చెరువుల పరిరక్షణ కోసమే హైడ్రా ఏర్పాటైందని ఏఏజీ పేర్కొన్నారు. హైడ్రా పనితీరు విషయంలో ఎలాంటి సందేహం అక్కరలేదని, అయితే కూల్చివేతల గురించి చర్చించాల్సి ఉన్నదని హైకోర్టు పేర్కొన్నది. ప్రదీప్‌రెడ్డి వేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని, జన్వాడలో ఉన్న ఫాంహౌస్‌ జీవో 11లోకి వస్తుందని ఏఏజీ హైకోర్టుకు తెలిపారు. జీవో 11 పరిధిలోని భూములు, ఫాంహౌస్‌లు నీటిపారుదల శాఖ చూస్తుందని వివరించారు. అయితే జీవో 11 పరిధిలోని వీటిని కూల్చివేసే హక్కు హైడ్రాకు లేదని ఏఏజీ కోర్టుకు తెలిపారు. కూల్చివేతల గురించి చర్చించాల్సి ఉన్నందన్న హైకోర్టు విచారణను మధ్యాహ్నానానికి వాయిదా వేసింది.

Raju

Raju

Writer
    Next Story