నిధులు ఇస్తున్నప్పుడు జాతీయ విపత్తుగా ప్రకటించడం ఎందుకు? కిషన్‌రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం వద్ద రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి ఉన్నదని, ఆ నిధులతో వరద బాధితులను ఆదుకోవాలని కేంద్ర మంత్రి సూచన

నిధులు ఇస్తున్నప్పుడు జాతీయ విపత్తుగా ప్రకటించడం ఎందుకు? కిషన్‌రెడ్డి
X

వర్ష ప్రభావం 11 జిల్లాల్లో ఎక్కువగా ఉన్నదని, వరద ప్రభావంపై సీఎం రేవంత్‌రెడ్డితో ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మాట్లాడారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. వరద సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారని చెప్పారు. దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేయాలని పీఎంతో ఆదేశించిందని కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి ఉన్నదని, ఎస్‌డీఆర్‌ఎఫ్‌లో రూ. 1,345 కోట్లు ఉన్నాయని, ఆ నిధులతో వరద బాధితులను ఆదుకోవాలని తెలిపారు.

రాష్ట్రం ఇచ్చే నివేదిక ఆధారంగా కేంద్ర బృందాలు సమీక్షిస్తాయన్నారు. మృతుల కుటుంబాలకు కేంద్రం రూ. 3 లక్షల పరిహారం ఇస్తుందన్నారు. ఆవులు, గొర్రెలకు కూడా కేంద్రం నష్టపరిహారం ఇస్తుందని చెప్పారు. ప్రధాని మోడీ అవసరమైతే రాష్ట్రంలో పర్యటిస్తారు. జాతయ విపత్తు ఎక్కడా ప్రకటించలేదన్న కిషన్‌రెడ్డి నిధులు ఇస్తున్నప్పుడు జాతీయ విపత్తుగా ప్రకటించడం ఎందుకు అని ప్రశ్నించారు. విపత్తు నిర్వహణ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవాలని ఆయన సూచించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌లో నిధుల కొరత లేదంటూ గతంలో వాడుకున్న నిధుల కు యుటిలైజ్‌ సర్టిఫికెట్లు సమర్పించలేదన్నారు. గత ఖర్చులకు యుటిలైజ్‌ సర్టిఫికెట్లు ఇవ్వనందున కొత్త నిధులు వాడుకునే పరిస్థితి లేదన్నారు. వరద సహాయక చర్యల్లో మా పార్టీ స్థానిక శాఖలు పాల్గొన్నాయి. బీజేపీ కార్యకర్తలు వరద సహాయక చర్యలో పాల్గొనాలని కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Raju

Raju

Writer
    Next Story