ట్రంప్‌ను ఓడించమే తన ఏకైక కర్తవ్యం: జో బైడెన్‌

తానే డెమోక్రటిక్‌ అమెరికా అధ్యక్ష అభ్యర్థిని అని.. ఇక పార్టీలో జరిగే నాటకాలు ఆపండి అని సొంత పార్టీ నేతలకు బైడెన్‌ లేఖ రాశారు.

ట్రంప్‌ను ఓడించమే తన ఏకైక కర్తవ్యం: జో బైడెన్‌
X

డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిని తానేనని జోబైడెన్‌ మరోసారి స్పష్టం చేశారు. తన అభ్యర్థిత్వంపై పార్టీలో అంతర్గత నాటకాలు, వస్తున్న వదంతులను ఇక కట్టిపెట్టాలని డెమోక్రటిక్‌ నేతలను హెచ్చరించారు. బరిలో నుంచి తాను వైదొలగాలని డిమాండ్‌ చేస్తున్న దాతలు, కొందరు డెమోక్రటిక్‌ సభ్యులకు ఆయన ఈ మేరకు లేఖ రాశారు.

ప్రత్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ను ఓడించడానికి తానే ఉత్తమమని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. అలాంటి విశ్వాసం లేకపోతే ఎన్నికల బరిలో నిలబడేవాడినే కాదని తెలిపారు. కాబట్టి పోటీ నుంచి తప్పుకునే సమస్యే లేదని స్పష్టం చేశారు. మూడున్నరేళ్లుగా తాను చేసిన అభివృద్ధిని, పనితీరును 90 నిమిషాల చర్చతో తీసిపారేయలేరని బైడెన్‌ పేర్కొన్నారు. తనను వైదొలగాని అంటున్న వారు కొద్ది మంది మాత్రమేనని, ఆర్థికరంగాన్నిగాడిలో పెట్టి, నిరుద్యోగాన్ని తగ్గించి ప్రపంచంలో అమెరికా స్థానాన్ని పునరుద్ధరించాని బైడెన్‌ లేఖలో పునరుద్ధరించారు. ప్రైమరీ ఎన్నికల్లో తనకు అనుకూలంగా లక్షల మంది ఓట్లు వేసిన విషయాన్ని బైడెన్‌ గుర్తు చేశారు. అలాంటి వైదొలగాలని కొంతమంది శాసనకర్తలు ఎలా డిమాండ్‌ చేస్తున్నారని ప్రశ్నించారు. ట్రంప్‌ను ఓడించమే తన ఏకైక కర్తవ్యమని చెప్పారు.

Raju

Raju

Writer
    Next Story