ప్రభాస్ కొత్త సినిమాలో ఛాన్స్ కొట్టిన హీరోయిన్ ఎవరంటే ?
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్ శనివారం పూజా కార్యక్రమాలతో మొదలైంది.
- By VamshiLoading...
- | 17 Aug 2024 11:41 AM GMT
X
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్ శనివారం పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం’ మూవీలోని 'కుర్చీ మడతపెట్టి’ పాటకు స్టెప్పులేస్తూ చేసి రీల్ విపరీతంగా వైరల్ అయిన పాకిస్థానీ డాన్స్ కొరియోగ్రాఫర్ ఇమాన్వి ఈ సినిమాలో హీరోగా నటించనుంది.
పూర్తిస్థాయి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఇది రానుంది. ఈ సినిమాకు ఫౌజీ అనే పేరు ఖరారు చేసినట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కానీ, రెబల్ స్టార్ జోడీగా అని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించడంతో ఈ న్యూస్ హాట్ టాఫిక్‌గా మారింది ఇమాన్వీ వివరాల కోసం ఇంటర్నెట్లో ప్రభాస్ ఫ్యాన్స్ వెతకడం మొదలు పెట్టారు. ఇమాన్ ఇస్మాయిల్ 1995 అక్టోబర్ 20న దిల్లీలో జన్మించింది. బాల్యం నుంచే డ్యాన్స్ అంటే ఈమెకు ఎంతో ఇష్టం. అందుకే ఒక పక్క డ్యాన్స్ నేర్చుకుంటూనే మరో పక్క ఎంబీఏ పూర్తి చేసింది.