యంగ్ హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి.. వధువు ఎవరంటే ?

టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం తన ఫస్ట్ సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్‌తో పెళ్లి ఎల్లుండి జరగనుంది. ఈ విషయాన్ని హీరో తెలిపారు.

Kiran
X

టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం తన ఫస్ట్ సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్‌తో పెళ్లి ఎల్లుండి జరగనుంది. ఈ విషయాన్ని హీరో తెలిపారు. ఈ సినిమా కంటే ముందు రాజావారు రాణిగారు లో నటించాడు. అయితే, తన మొదటి చిత్రం హీరోయిన్ రహస్య గోరఖ్ నే తన జీవిత భాగస్వామిగా ఫిక్స్ అయ్యాడు.. ఆ సినిమా వల్లే వీరిద్దరి పరిచయం స్నేహంగా మారి ప్రేమ వరకు వెళ్ళింది. ఇలాగే వారు ఐదేళ్లు ప్రేమించుకొని ఇరు కుటుంబాలను ఒప్పించి ఈ మధ్యే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు.

వీరిద్దరి మీద మొన్నటి వరకు ఎన్నో వార్తలు ఎంగేజ్మెంట్ ఎప్పుడో చేసుకున్నారు.. కానీ పెళ్లి ఇంకా చేసుకోలేదంటూ చాలా మందికి సందేహం ఉంది. ఇప్పుడు వాటన్నింటికి చెక్ పెట్టె అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆయన మ్యారేజ్ 22వ తేదీన కూర్గ్ లో జరగబోతోంది. ఈ పెళ్లికి అత్యంత సన్నిహితులను మాత్రమే ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. తర్వాత హైదరాబాదులో ఒక రిసెప్షన్ ఏర్పాటు చేసి సినీ పరిశ్రమ పెద్దలందరినీ ఆహ్వానించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

Vamshi

Vamshi

Writer
    Next Story