భూములు తాకట్టు పెడితే కంపెనీలకు ఏమిస్తారు?: కేటీఆర్‌

ఉన్న కంపెనీలు కూడా సరైన ప్రోత్సాహం లేక పక్కచూపులు చూస్తున్నాయి. రాజకీయ లబ్ధి కోసం భూములు తాకట్టు పెడితే పరిశ్రమలు పెట్టే కంపెనీలకు ఏమిస్తారు? అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

భూములు తాకట్టు పెడితే కంపెనీలకు ఏమిస్తారు?: కేటీఆర్‌
X

ఆర్థికరంగాన్ని సరిగ్గా నిర్వహించడం రేవంత్‌ సర్కార్‌కు చేతకాక, నిధుల సమీకరణకు ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు.ఈ మేరకు కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు.

పరిశ్రమల శాఖకు చెందిన రూ.. 20 వేల కోట్ల విలువ చేసే 400 ఎకరాల భూములను తనాఖా పెట్టి రూ. 10 వేల కోట్లు సమీకరించుకోవడానికి ప్రభుత్వం యత్నిస్తున్నట్టు సమాచారం. దీనికోసం మధ్యవర్తిగా మర్చంట్‌ బ్యాంకర్‌ను పెట్టి రూ. 100 కోట్ల కమీషన్‌ ఇచ్చేందుకు సిద్ధమైందని ఆరోపించారు.

ప్రభుత్వం మతిలేని చర్య వల్ల రాష్ట్ర ప్రగతి శాశ్వతంగా కుంటుపడే ప్రమాదం ఉన్నదని కేటీఆర్ హెచ్చరించారు.

కోకాపేట, రాయదుర్గం వంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి. అలాంటి చోట 400 ఎకరాలు ప్రైవేట్‌ సంస్థలకు తనఖా పెట్టడం అనాలోచిత చర్య అని దుయ్యబట్టారు. అసలే గత ఏడు నెలలుగా రాష్ట్ర పారిశ్రామికరంగం స్తబ్దుగా ఉన్నది. కొత్తగా పెట్టుబడులు రావడం లేదు. ఉన్న కంపెనీలు కూడా సరైన ప్రోత్సాహం లేక పక్కచూపులు చూస్తున్నాయి. రాజకీయ లబ్ధి కోసం భూములు తాకట్టు పెడితే పరిశ్రమలు పెట్టే కంపెనీలకు ఏమిస్తారు? కొత్తగా మన యువతకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? అని ప్రశ్నించారు.

Raju

Raju

Writer
    Next Story