విపత్తుల నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేస్తాం : మంత్రి పొంగులేటి

తెలంగాణలో 10 సంవత్సరాల తర్వాత తొలిసారిగా వరదలపై యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

విపత్తుల నిర్వహణ  వ్యవస్థను బలోపేతం చేస్తాం : మంత్రి పొంగులేటి
X

తెలంగాణలో 10 సంవత్సరాల తర్వాత తొలిసారిగా వరదలపై యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం సచివాలయంలో వరద కార్యాచరణ ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. వరద సంబంధం ఉన్న ప్రతి విభాగం రాష్ట్ర స్ధాయిలో, జిల్లా స్థాయిలో వరదలపై ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాలలో వరద ముప్పును తగ్గించడానికి అవసరమైన ప్రణాళికలను తయారు చేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర స్థాయిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ తరపున ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేయాలని సూచించారు.

వరదలు, కాలువలు, చిన్న డ్రైనేజీలనుంచి మొదలుకుని, హైరైజ్ భవనాల వరకు ఏ పరిస్థితి ఎదురైనా దానిని అధిగమించడానికి వీలుగా అధునాతన పరికరాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.హైడ్రా పరిధిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరించారు. గతంలో 30 బృందాలు ఉండగా దాన్ని 70 కి పెంచామని అలాగే సిబ్బంది సంఖ్యను 1800 నుండి 3500 వరకు పెంచడం జరిగిందని వివరించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్ కు సంబంధించి హైడ్రాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. హైడ్రాకు కావలిసిన అధునాతన పరికరాలు అందిస్తామని ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను పంపించాలని హైడ్రా కమిషనర్‌కి మంత్రి సూచించారు.

Vamshi

Vamshi

Writer
    Next Story