రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతాం: సీఎం

హైదరాబాద్‌ శతాబ్దాలుగా జాతులు, సంస్కృతులు చూసిందని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. కుతుబ్‌షాహీ కుతుబ్‌షాహీ ఏడు టూంబ్స్‌ నాటి నిర్మాణ నైపుణ్యానికి, సాంస్కృతిక గొప్పతనానికి నిదర్శనం అన్నారు.

రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతాం: సీఎం
X

హైదరాబాద్‌ శతాబ్దాలుగా జాతులు, సంస్కృతులు చూసిందని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. కుతుబ్‌షాహీ కుతుబ్‌షాహీ ఏడు టూంబ్స్‌ నాటి నిర్మాణ నైపుణ్యానికి, సాంస్కృతిక గొప్పతనానికి నిదర్శనం అన్నారు. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంతో పాటు ప్రపంచ పటంలో తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం సగర్వంగా ఉంచుతుందని పేర్కొన్నారు. 2013లో ఎంవోయూతో ప్రారంభించి వందకంటే ఎక్కువ స్మారక చిహ్నాల పరిరక్షణకు శ్రీకారం చుట్టిన ఆగాఖాన్‌ పనితీరును సీఎం అభినందించారు.

కుతుబ్‌షాహీ కుతుబ్‌షాహీ టూంబ్స్‌ను సందర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణరావు, ఎంపీ అసదుద్దీన్‌లతో కలిసి పరిశీలించారు. హైదరాబాద్‌కు వన్నె తెచ్చేలా ఆగాఖాన్‌ అద్భుతంగా పనిచేసిందని మంత్రి జూపల్లి, ఎంపీ అసదుద్దీన్‌ అన్నారు.

ఈ సందర్భంగా కుతుబ్‌షాహీ టూంబ్స్‌లో సీఎం మొక్క నాటి హరిత స్ఫూర్తిని చాటారు. అక్కడి హెరిటేజ్‌ పార్క్‌ను సందర్శించారు. 2013లో కుతుబ్‌షాహీ వారసత్వ సంపద పరిరక్షణ ప్రాజెక్టును ఆగాఖాన్‌ ఫౌండేషన్‌ చేపట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్ర సాంస్కృతిక శాఖతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

Raju

Raju

Writer
    Next Story