జానపద కళలను పరిరక్షిస్తాం

మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

జానపద కళలను పరిరక్షిస్తాం
X

అంతరించిపోతున్న జాన‌ప‌ద‌ కళారూపాలకు మళ్లీ పునరుజ్జీవాన్ని తీసుకువ‌చ్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం రవీంద్ర భారతిలో నిర్వహించిన జానపద దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీవీలు, కంప్యూటర్లు, సెల్‌ ఫోన్లలాంటి ప్రసార మాధ్యమాలు రాకముందే జానపద కళాకారులకు ప్రత్యేక గుర్తింపు ఉండేదని, వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కేదని అన్నారు. ఇప్పుడు అరచేతిలోనే ప్రపంచాన్ని చూసే రోజులు కావడంతో కళాకారుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. అలాంటి కళాకారులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందివచ్చిన సాంకేతికతను యువత చెడు కోసం ఉపయోగించి భవిష్యత్‌ నాశనం చేసుకుంటున్నారని, అలాంటి వారిలో మార్పు తీసుకువచ్చే బాధ్యతను కళాకారులు, రచయితలు తీసుకోవాలన్నారు. కార్య‌క్ర‌మంలో సంగీత నాట‌క అకాడ‌మీ చైర్ ప‌ర్స‌న్ డాక్ట‌ర్ అలేఖ్య పుంజల, ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత‌లు కెతావ‌త్ సోమ‌లాల్, గ‌డ్డం స‌మ్మ‌య్య, ఇతర అతిథులు కె.వి.ర‌మ‌ణాచారి, సారిప‌ల్లి కొండ‌ల రావు, లంకా ల‌క్ష్మినారాయ‌ణ‌, ర‌మ‌ణ‌రెడ్డి, మామిడి హ‌రికృష్ణ, శ్రీనివాస్ గౌడ్, లింగ‌య్య‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Next Story