ఆదివాసీలు హక్కుల కోసం పోరాడాలి : మంత్రి సీతక్క

గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం బంజారాహిల్స్ లోని ఆదివాసి భవన్ లో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

Seethakka
X

గిరిజనులకు కాంగ్రెస్ సర్కార్ ఎప్పుడు అండగా ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని ఆదివాసి భవన్ లో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మన హక్కుల్ని కోసం పోరాడి సాధించుకోవాలని అన్నారు. ప్రస్తుతం చెంచు జాతి అంతరించిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. గత యూపీయే ప్రభుత్వం హయంలో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ నేతృత్వంలో అటవీ హక్కుల చట్టం ద్వారా ఆదివాసీలకు భూమి మీద హక్కు కల్పించారని చెప్పారు. ఆ చట్టం వచ్చాక గిరిజనులుకు భూమిపై హక్కు వచ్చిందన్నారు.

కానీ 2023 లో మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జీవో చట్టం ప్రకారం గ్రామాల్లో మైనింగ్ చేసేందుకు గ్రామ పంచాయతీల అనుమతి లేకుండా నేరుగా ఢిల్లీలో అనుమతులు ఉంచే చాలు అనే నిబంధన తీసుకువచ్చారని విమర్శించారు. ఈ చట్టం ప్రకారం అటవీ ప్రాంతాల్లో మైనింగ్‌కి అనుమతులు ఇస్తున్నారు. కానీ అదే ఫారెస్ట్ ఏరియాలో రోడ్లు వేసేందుకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. అడవుల్ని గిరిజన ప్రజలే నాశనం చేస్తున్నారని జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. జీవో నెంబర్ 3 రద్దు చేయడంతో ఉద్యోగాలు లేవుని సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, పలువురు గిరిజనే నేతలు హాజరయ్యారు.

Vamshi

Vamshi

Writer
    Next Story