బంగ్లాదేశ్‌ పరిణామాల్లో మా ప్రమేయం లేదు: అమెరికా

బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభంలో అమెరికా ప్రమేయం ఉన్నదన్న ఆరోపణలను ఆ దేశం ఖండించింది.

బంగ్లాదేశ్‌ పరిణామాల్లో మా ప్రమేయం లేదు: అమెరికా
X

బంగ్లాదేశ్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం, అల్లర్ల వెనుక అమెరికా ఉన్నదని ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌ హసీనా ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన అగ్రరాజ్యం ఆ ఆరోపణలను ఖండించింది. తనను దేశం విడిచి వెళ్లేలా చేసిన కుట్ర వెనుక అమెరికా ఉన్నదనే హసీనా ఆరోపణలను వైట్‌హౌస్‌ తోసిపుచ్చింది. ఆమెను పదవి నుంచి దించడంలో తమ పాత్ర ఏమీ లేదని అమెరికా స్పష్టం చేసింది.

ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని, తమపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఖండించింది. బంగ్లాదేశ్‌ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని వివరణ ఇచ్చింది. భవిష్యత్తు ప్రభుత్వంపై బంగ్లాదేశ్‌ ప్రజలే నిర్ణయం తీసుకోవాలని వైట్ హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ జీన్‌ పియర్‌ చెప్పారు. అక్కడి పరిణామాలను అమెరికా గమనిస్తున్నదని తెలిపారు.

Raju

Raju

Writer
    Next Story