ఏఐలో పూర్తిగా పట్టు సాధించబోతున్నాం: శ్రీధర్‌బాబు

హెచ్‌ఐసీసీలో గ్లోబల్‌ ఏఐ సదస్సు ప్రారంభం.. ఈ కార్యక్రమంలో ఏఐ రోడ్‌ మ్యాప్‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి

ఏఐలో పూర్తిగా పట్టు సాధించబోతున్నాం: శ్రీధర్‌బాబు
X

హైదరాబాద్ లోని హెచ్‌ఐసీసీలో గ్లోబల్‌ ఏఐ సదస్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏఐ రోడ్‌ మ్యాప్‌ను ఆవిష్కరించారు. రాబోయే రెండు, మూడేళ్లలో రాష్ట్రంలో ఏఐ అభివృద్ధి కోసం చేపట్టే చర్యలను ఇందులో పేర్కొన్నారు. ఈ సదస్సుకు వివిధ ఐటీ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ... ఏఐలో పూర్తిగా పట్టు సాధించబోతున్నామన్నారు. తెలంగాణను ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామన్నారు. ఏటా అభివృద్ధి సాధిస్తూ ముందుకు వెళ్తున్నాం. డీప్‌ఫేక్‌ లాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా ఏఐని సరైన దారిలో వినియోగించుకుంటామని తెలిపారు. ప్రపంచస్థాయి వర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకుంటామని పేర్కొన్నారు. ఎథికల్‌ ఏఐ విషయంలో జపాన్‌ను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ప్రపంచస్థాయి ఏఐ కంపెనీలు ఇక్కడ ఏర్పాటయ్యేలా చూస్తామని వివరించారు. హైదరాబాద్‌కు దగ్గరల్లో 200 ఎకరాల్లో ఏఐ సిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాబోయే రెండు రోజులు హెచ్‌ఐసీసీ వేదికగా ఏఐపైనా చర్చలు, సెమినార్లు ఉంటాయని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.

Raju

Raju

Writer
    Next Story