నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం : సీఎం రేవంత్‌

ఈనెల 27న జరిగే నీత్‌ ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కేంద్రం తెలంగాణ హక్కులకు భంగం కలిగించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం చేశారంటూ సీఎం మండిపడ్డారు.

Cm revanth reddy
X

ఈనెల 27న ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం పునర్విభజన చట్టంలో ఎన్నో అంశాలు పెట్టారని.. కేంద్రంలోని బీజేపీ మన హక్కులను పట్టించుకోలేదని మండి పడ్డారు. కేంద్రం తెలంగాణ హక్కులకు భంగం కలిగించిందని...నిధుల కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం చేసింది. తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలుపనుందని అన్నారు. ఈ లోపు కేంద్రం సవరించిన బడ్జెట్లో తెలంగాణకు న్యాయం చేస్తామని తెలంగాణకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇస్తామని , తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలని, గిరిజన యూనివర్సిటీ పూర్తిస్థాయిలో ప్రారంభించాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. అయితే ఈ నీతి ఆయోగ్ మీటింగ్ ను తమిళనాడు సీఎం ఎం. కె. స్టాలిన్ బహిష్కరించగా తమ పార్టీకి చెందిన ముగ్గురు సీఎంలు దూరంగా ఉంటారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బడ్జెట్ విషయంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేరళ ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ సమావేశానికి హజరు అవుతారా లేదా అనేది ప్రకటన చేయలేదు. రాజకీయలు రేపటి నుంచి మాట్లాడుకుందాం. ఇవాళ తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ హక్కులు, నిధులు, అనుమతు కోసం ఏకాభిప్రాయంతో నిలబడితే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుడు పెద్ద సమస్య కాదన్నారు.కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే అంశంపై తీర్మానానికి తెలంగాణ శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని శాసనసభలో తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ సమావేశాల్లోనే కేంద్ర బడ్జెట్ కు సవరణలు చేసి తెలంగాణకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.

Vamshi

Vamshi

Writer
    Next Story