సీతారామ ప్రాజెక్టు ద్వారా ఏటా 6 లక్షల ఎకరాలకు నీరు : మంత్రి ఉత్తమ్‌

భద్రాద్రి సీతారామ ప్రాజెక్టు 2, 3 లిఫ్ట్‌ ఇరిగేషన్లను సీఎం రేవంత్‌రెడ్డి పంద్రాగస్టున ప్రారంభిస్తారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. అనంతరం పంప్‌ హౌస్‌ ట్రయల్‌ రన్‌ను మంత్రులు ప్రారంభించారు.

Sitarama procect
X

భద్రాది సీతారామ ప్రాజెక్టు 2, 3 లిఫ్ట్‌ ఇరిగేషన్లను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగస్టు 15న ప్రారంభిస్తారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. సీతారామ ప్రాజెక్టు పంప్‌ హౌస్‌-2ను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం పంప్‌ హౌస్‌ ట్రయల్‌ రన్‌ను ప్రారంభించారు.

భద్రాది కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలంలో పూసుగూడెంలో ఆయన మాట్లారు ఆగస్టు 15న రూ.2 లక్షల రుణమాఫీ ప్రకటిస్తామన్నారు. ఏటా 6 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నట్లు తెలిపారు. 2026 ఆగస్టు 15 నాటికి ఆయకట్టులోని ప్రతి ఎకరానికి నీరిస్తామని తెలిపారు. పంప్‌ హౌస్‌ల పరిధిలో డిస్ట్రిబ్యూటరీ కాలువలు త్వరగా పూర్తి చేయాలన్నారు. సత్తుపల్లి ట్రంక్‌ పనుల్లో యాతాలకుంట టన్నెల్‌ పూర్తి చేయాలని చెప్పారు. జూలూరుపాడు టన్నెల్‌ పూర్తయితే పాలేరు వరకు గోదావరి జలాలు వస్తాయని వివరించారు.

Vamshi

Vamshi

Writer
    Next Story