నంది మేడారం పంప్‌ హౌస్‌ ద్వారా నీటి విడుదల

నీతిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు వర్షాకాలం ప్రారంభమైన సుమారు 45 రోజుల తర్వాత మొదటిసారి పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి.

నంది మేడారం పంప్‌ హౌస్‌ ద్వారా నీటి విడుదల
X

అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా కాళేశ్వరం పంప్‌హౌస్‌లను ఆన్‌ చేయకుంటే యాభై వేల మంది రైతులతో వచ్చి మేమే ఆన్‌ చేస్తామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హెచ్చరించిన మరుసటి రోజే కాంగ్రెస్‌ ప్రభుత్వం దిగివచ్చింది. శనివారం ధర్మారం మండలం నంది పంప్‌హౌస్‌లో నాలుగు మోటార్లను, రామడుగు మండలం గాయతీ పంప్‌ హౌస్‌లో నాలుగు బహుబలి మోటార్లు ఆన్‌ చేసి మిడ్‌ మానేర్‌ ప్రాజెక్టుకు ఎత్తిపోతలు ప్రారంభించింది.

నీతిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు వర్షాకాలం ప్రారంభమైన సుమారు 45 రోజుల తర్వాత మొదటిసారి పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 20.1 టీఎంసీలు కాగా.. శనివారం మధ్యాహ్నం నాటికి 17.39 టీఎంసీలు దాటడంతో నిండుకుండలా మారింది.

నంది పంప్‌హౌజ్‌లో నాలుగు మోటార్ల ద్వారా గాయత్రి పంప్‌హౌజ్‌కు 12, 600 క్యూసెక్కుల నీళ్లు వదులుతున్నారు. ఇక్కడి నుంచి మిడ్‌ మానేరు ప్రాజెక్టుకు ఎత్తిపోతల నీళ్లను తరలిస్తున్నారు. మిడ్‌ మానేరు నిండిన తర్వాత ఎగువ మానేరుకు ..దాంతో పాటు అన్నపూర్ణ, రంగనాయక సాగర్‌, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ రిజర్వాయర్లకు నీటిని తరలించే అవకాశం ఉన్నదని కాళేశ్వరం ప్రాజెక్టు సీఈ సుధాకర్‌రెడ్డి తెలిపారు.

Raju

Raju

Writer
    Next Story