పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు

యుద్ధానికి కాలుదువ్వుతున్న ఇజ్రాయిల్‌, ఇరాన్‌ దేశాలు భారీ పోరుకు అవసరమైన ఆయుధ సంపత్తిని సమకూర్చుకునే యోచనలో ఉన్నాయి.

పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు
X

యుద్ధానికి కాలుదువ్వుతున్న ఇజ్రాయిల్‌, ఇరాన్‌ దేశాలు భారీ పోరుకు అవసరమైన ఆయుధ సంపత్తిని సమకూర్చుకునే యోచనలో ఉన్నాయి.ఏ క్షణమైనా యుద్ధం మొదలు కావొచ్చనే అంచనాల నడుమ పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధానికి రెడీ అన్నట్లు లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై క్షిపణులతో ఇజ్రాయిల్‌ విరుచుకుపడింది. ఆ దాడిలో హెజ్‌బొల్లా వైపు పలువురు మరణించినట్లు తెలుస్తోంది.

దీనికి ప్రతిగా హెబ్‌బొల్లా ప్రయోగించిన డ్రోన్లు ఇజ్రాయిల్‌లోని సహారియా నగరం వద్ద విధ్వంసం సృష్టించాయి. మరోవైపు ఇరాన్‌ అనుకూల మినిషియా సభ్యులు ఇరాక్‌లోని స్థానిక శిబిరంపై క్షిపణులను ప్రయోగించారు. ఈ దాడిలో పలువురు అమెరికా సైనికులు గాయపడి నట్లు సమాచారం. ఇజ్రాయిల్‌కు గట్టిగా బుద్ధి చెబుతామన్న ఇరాన్‌ మిత్ర దేశం రష్యా నుంచి ఆయుధాలను సమకూర్చుకునే పనిలో పడింది. ఇరాన్‌ కు రష్యా అధునాత రాడార్‌ వ్యవస్థలు, క్షిపణి విధ్వంసక వ్యవస్థలను పంపుతున్నట్లు తెలుస్తోంది.

ఆక్రమిత వెస్ట్‌ బ్యాంక్‌లో ఇజ్రాయిల్‌ చేసిన దాడుల్లో 8 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. మృతుల్లో నలుగురు యువకులు ఉన్నారని పాలస్తీనా అధికారులు తెలిపారు. అటు దక్షిణ లెబనాన్‌లోని ఓ గ్రామంపై ఇజ్రాయిల్‌ జరిపిన వైమానిక దాడిలో నలుగురు మృతి చెందారని ఆ దేశ ఆరోగ్యశాఖ తెలిపింది. అంతకుముందు ఇజ్రాయిల్‌ సైనిక స్థావరాలే లక్ష్యంగా హెజ్‌బొల్లా డ్రోన్‌ దాడి చేసింది. ఈ దాడిలో పలువురు ఇజ్రాయిల్‌ పౌరులు గాయపడ్డారు. లెబనాన్‌ నుంచి వచ్చిన డ్రోన్‌లలో ఒకదాన్ని కూల్చివేశామని ఇజ్రాయిల్‌ పేర్కొన్నది.

Raju

Raju

Writer
    Next Story