సూపర్-8లో ప్రవేశించిన టీమిండియా

అమెరికాపై పోరాడి గెలిచిన టీమ్‌ ఇండియా

Team india
X

టీ20 వరల్డ్‌కప్‌లో అమెరికాపై టీమిండియా 7 వికెట్ల తేడాతో హ్యాట్రిక్ విజయం సాధించింది. దీంతో గ్రూప్-Aలో రోహిత్ సేన సూపర్-8కు చేరింది. తొలుత బ్యాటింగ్ చేసి అమెరికా నిర్దేశించిన 111 పరుగుల లక్ష్యాన్ని భారత్ 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టార్గెట్ ఛేజింగ్‌లో స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. 49 బంతుల్లో 50 పరుగులు చేసి, భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు.

శివమ్ దూబేతో జతకట్టి చివరి వరకు క్రీజులోనే ఉన్నాడు. బౌలింగ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. 4 ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలకమైన వికెట్లు పడగొట్టాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఎస్‌ఏ 8 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. సూపర్-8కు చేరుకోవడం సంతోషంగా ఉందని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. న్యూయార్క్ పిచ్‌పై ఆడటం తేలికేమి కాదన్నారు. ఇలాంటి పిచ్‌పై 110 రన్స్ ఛేదించడం కష్టమే అని రోహిత్ తెలిపారు.

Vamshi

Vamshi

Writer
    Next Story