ప‌వ‌న్ బర్త్ డే సందర్బంగా..అరుదైన ఫొటోను షేర్ చేసిన వ‌రుణ్

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ బర్త్ డే సందర్బంగా మెగా హీరో వ‌రుణ్ తేజ్ ట్వీట్టర్ వేదికగా బాబాయ్‌కి విషెస్ తెలుపుతూ అరుదైన ఫొటోను షేర్ చేశాడు.

varun
X

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ బర్త్ డే సందర్బంగా మెగా హీరో వ‌రుణ్ తేజ్ ట్వీట్టర్ వేదికగా బాబాయ్‌కి విషెస్ తెలుపుతూ అరుదైన ఫొటోను షేర్ చేశాడు. దాంతో ఈ ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. జన్మదిన శుభాకాంక్షలు బాబాయ్! నేను ఎప్పుడూ మీరు పై స్థాయిలో ఉండాల‌ని కోరుకుంటాను. ధ‌ర్మం వైపు మీరు అనుస‌రించిన మార్గం, ఇత‌రుల‌కు హెల్ప్ చేయాల‌నే మీ తిరుగులేని సంక‌ల్పం అనంతంగా స్ఫూర్తిదాయ‌కంగా ఉన్నాయి.

మీలోని అగ్ని ప్ర‌కాశ‌వంతంగా మండుతూనే ఉంటుంది. మీరు ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా, బ‌లంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను. మిమ్మ‌ల్ని ఎప్ప‌టికీ ప్రేమిస్తునే ఉంటాను. మీరు నా శ‌క్తి తుఫాన్‌. హ్యాపీ బ‌ర్త్‌డే జ‌న‌సేనాని" అంటూ వ‌రుణ్ త‌న ట్వీట్‌లో రాసుకొచ్చాడు. ఇక ఈ ట్వీట్‌కు త‌న బాల్యం ఫొటో ఒక‌టి జోడించాడు. ఆ ఫొటోలో కళ్యాణ్ సోఫాలో కూర్చొని ఉండ‌గా, వ‌రుణ్ ఆయ‌న కాళ్లు ప‌డుతున్నాడు. వ‌రుణ్‌ను ప‌వ‌న్ ఆశీర్వ‌దిస్తున్న‌ట్లు ఫోజు పెట్ట‌డం కూడా ఆ ఫొటోలో ఉంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌న‌కు బ‌ర్త్‌డే శుభాకాంక్షాలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజ‌కీయ‌, ఇత‌ర రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు, అభిమానులు జ‌న‌సేనానికి భారీ ఎత్తున జన్మదిన శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. ఇక ప‌వ‌న్ కుటుంబ స‌భ్యులు చిరంజీవి, నాగబాబు, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ కూడా విషెస్ తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవి ఇవాళ ప్రత్యేకమైన పోస్టు పెట్టారు.‘ఏటా పుట్టిన రోజు వస్తుంది. కానీ, ఈసారి ప్రత్యేకం.రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన వ్యక్తిగా ప్రజలు నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి. రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు. చేస్తావనే నమ్మకం నాతో పాటు ఏపీ ప్రజలకు ఉంది.దీర్ఘాయుష్మాన్ భవ! అని ట్వీట్ చేశారు. మరోవైపు మెగాపవర్ స్టార్ రాంచరణ్ కూడా ‘మా పవర్ స్టార్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు.

Vamshi

Vamshi

Writer
    Next Story