తుంగభద్ర ప్రాజెక్టును పరిశీలించిన : డీకే శివ కుమార్‌

తుంగభద్ర ప్రాజెక్టును కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్‌ పరిశీలించారు.

DK Shivakumar
X

తుంగభద్ర ప్రాజెక్టును కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్‌ పరిశీలించారు. డ్యామ్ గేటు బిగించే అంశంపై అధికారులతో చర్చించారు. ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడం బాధకరమని డీకే అన్నారు. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు వరమని పేర్కొన్నారు. ఏపీ ఎమ్మెల్యేలు కాల్వ శ్రీనివాసులు, బుసినే విరుపాక్షీ కూడా చేరుకున్నారు. ఈ సందర్భంగా 19వ గేటు కొట్టుకుపోవడం పై తుంగభద్ర బోర్డు అధికారులతో విచారిస్తున్నారు నేతలు.

రైతులకు నష్టం కలగకుండా త్వరగా 19వ గేటు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తుంగభద్ర డ్యామ్ లో 40 టీఎంసీల నీరు నిల్వ ఉంచి.. మిగతా నీటిని నదికి విడుదల చేస్తే గేటు మరమ్మతులకు ఆస్కారం ఉంటుందని డీకె తెలిపారు. వీలైనంత త్వరగా గేటు పునరుద్ధరణ చేస్తామని, ఈ ఏడాది ఖరీఫ్ పంటకు మాత్రమే నీళ్లు అందేలా చూస్తామని స్పష్టం చేశారు. రబీ పంటకు నీరు అందించడం కొంచెం కష్టమేనని, రైతులు సహకరించాలని ఆయన కోరారు.

Vamshi

Vamshi

Writer
    Next Story