రెండు రాష్ట్రాలను సమానంగా చూడండి : సీఎం రేవంత్

వరద సాయం విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలను ఒకే విధంగా చూడాలన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి శివారాజ్ సింగ్ షాకిచ్చారు.

రెండు రాష్ట్రాలను సమానంగా చూడండి : సీఎం రేవంత్
X

వరద సాయం విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలను ఒకే విధంగా చూడాలన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి శివారాజ్ సింగ్ షాకిచ్చారు. విపత్తుల సమయంలో ప్రజలకు సాయం చేయడంలో పార్టీలు, రాజకీయాలు ఉండవని తెలిపారు. నిన్న ఏపీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పర్యటించారు. వరద నష్టం పై ఆరా తీశారు. సెక్రటేరియట్‌లో కేంద్ర మంత్రికి వరద ప్రభావం, నష్టాన్ని ముఖ్యమంత్రి, అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా తెలిపారు. తెలంగాణలో వరదల వల్ల సుమారు 5,438 కోట్ల నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచాన వేసినట్టు వివరించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధుల విడుదల విషయంలో మార్గదర్శకాలను సడలించాలని కోరారు.

పలు జిల్లాల్లో ఒక్క రోజే 40 సెం.మీ వర్షంకురిసిందని, వరద ప్రభావిత జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉందని సీఎం చెప్పారు. రహదారులు, ఇళ్లు, బ్రిడ్జిలు పూర్తిగా దెబ్బతిన్నాయని.. రాకపోకలు స్తంభించాయని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో తీవ్ర పంట నష్టం జరిగిందని.. పొలాలన్నీ రాళ్లు, ఇసుక మేటలతో నిండిపోయాయని వివరించారు. తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు రూ.10వేలు పంపిణీ చేస్తున్నట్లు కేంద్ర మంత్రికి సీఎం చెప్పారు. ఇవాళ తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో పర్యటించారు.ఈ తరుణంలోనే తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం చేసింది. వరదలకు నష్టపోయిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం రూ.3,300 కోట్ల ఆర్థిక సాయం చేసినట్టు ప్రకటించింది. తక్షణ సహాయ చర్యల కోసం కేంద్రం నిధులను విడుదల చేసింది.

Vamshi

Vamshi

Writer
    Next Story