హైదరాబాద్‌లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఈ రూట్లలో వెళ్లకండి

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర నేపథ్యంలో ఈ నెల 21, 22 తేదీల్లో హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు పెట్టారు.

హైదరాబాద్‌లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఈ రూట్లలో వెళ్లకండి
X

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర నేపథ్యంలో ఈ నెల 21, 22 తేదీల్లో హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు పెట్టారు. ఉజ్జయిన మహంకాళి ఆలయానికి రెండు కిలోమీటర్ల పరిధితో పాటు సికింద్రాబాద్‌ ప్రాంతంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఆదివారం బోనాల జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఆదివారం బోనాల జాతర, సోమవారం రంగం కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకూడదనే ఉద్దేశంతోనే ట్రాఫిక్‌ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. కాబట్టి వాహనదారులు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.

ఈ రూట్లలో వెళ్లకండి

కర్బాలా మైదాన్‌, రాణిగంజ్‌, రామ్‌గోపాల్‌పేట్‌ ఓల్డ్‌ పోలీస్‌స్టేషన్‌, పారడైజ్, సీటీవో ప్లాజా, ఎస్ బీఐ ఎక్స్‌ రోడ్‌, వైఎంసీఏ ఎక్స్‌ రోడ్‌, సెయింట్‌ జాన్స్‌ రోటరీ, సంగీత్‌ ఎక్స్‌ రోడ్‌, ప్యాట్నీ ఎక్స్‌ రోడ్‌, పార్క్‌లేన్‌, బాటా, బైబిల్‌ హౌజ్‌, మినిస్టర్‌ రోడ్‌, రసూల్‌పురా వైపు వచ్చే వాహ‌న‌దారులు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంచుకోవాల‌ని పోలీసులు సూచించారు. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌కు వ‌చ్చే ప్ర‌యాణికుల‌నూ పోలీసులు అల‌ర్ట్ చేశారు. స్టేష‌న్‌లోకి ప్లాట్ ఫాం నంబ‌ర్ 1 నుంచి కాకుండా ప్లాట్ ఫాం నంబ‌ర్ 10 నుంచి లోప‌లికి చేరుకోవాల‌ని ప్ర‌యాణికుల‌కు సూచించారు.

Raju

Raju

Writer
    Next Story