హైదరాబాద్‌లో కుండపోత వాన

రాత్రి కూడా భారీ వర్షం అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిక

హైదరాబాద్‌లో కుండపోత వాన
X

హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా గురువారం సాయంత్రం కుండపోతగా భారీ వర్షం పడింది. దీంతో రోడ్లపైకి వాన నీరు చేరడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. సెలవురోజు కావడంతో సాయంత్రం ఇంటి నుంచి బైటికి వచ్చిన నగరవాసులు భారీ వర్షానికి తడిసి ముద్దయ్యారు. గంటకు పైగా ఏకధాటిగా వానపడింది. దీంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి. పలు చోట్ల డ్రైనేజీలు పొంగి ప్రవహించాయి. ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

రాత్రి కూడా భారీ వర్షం అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్ష సూచనపై జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి స్పందించారు. అత్యవసరమైతే తప్పా ప్రజలు ఇళ్ల నుంచి బైటికి రావొద్దని విజ్ఞప్తి చేశారు. జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. జీహెచ్‌ఎంసీలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు.

Raju

Raju

Writer
    Next Story