నేడు మహబూబ్‌నగర్‌కు ముఖ్యమంత్రి

సీఎం అధికారిక కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో సాటునీటి ప్రాజెక్టుల పూర్తి, విద్య, వైద్యం, పర్యాటకం వంటవ అంశాలే ప్రధాన అజెండాగా నేడు సమీక్ష జరగనున్నది.

నేడు మహబూబ్‌నగర్‌కు ముఖ్యమంత్రి
X



ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. అధికారిక పర్యటనలో భాగంగా సీఎం హోదాలో ఎన్నికల తర్వాత మొదటిసారిగా మహబూబ్‌నగర్‌కు వెళ్లనున్నారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నారు. సాగునీటి రంగంలో ప్రాజెక్టుల పూర్తి, విద్య, వైద్యం, పర్యాటకం, మహిళా సాధికారత సహా కీలకమైన అంశాలపై సమీక్ష చేయనున్నారు.

ప్రత్యేక హెలీకాప్టర్‌లో మహబూబ్‌నగర్‌కు వెళ్లనున్న సీఎం మొదట ఉమ్మడి జిల్లా ప్రముఖులతో సమావేశమౌతారు. అనంతరం మహిళా శక్తి క్యాంటిన్‌ను ప్రారంభిస్తారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.అనంతరం మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేతో సమీక్ష నిర్వహిస్తారు. ఆతర్వాత ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌హాల్‌లో పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. సీఎం సొంత జిల్లా కావడంతో సమీక్ష తర్వాత జిల్లా అభివృద్ధికి ఎలాటి నిర్ణయాలు తీసుకుంటారనే ఆసక్తి నెలకొన్నది. సీఎం పర్యటనకు ముందే జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులతో భేటీ అయ్యారు. సీఎం సమావేశంలో ఏ అంశాలు ఆయన దృష్టికి తీసుకువెళ్లాలన్నది అధికారులతో చర్చించారు. ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు కావాల్సిన నిధులు, అభివృద్ధి పనలకు సంబంధించిన అంశాలపై అధికారులకు నివేదిక సమర్పించారు.

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT ) ఉమ్మడికి జిల్లాల్లో ఏర్పాటు చేయాలని, దానికి అవసరమైన ప్రభుత్వ స్థలం జడ్చర్ల వద్ద ఉన్నదని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు, సమీక్షలో దీనిపై చర్చించనున్నట్టు వారు తెలిపారు.

Raju

Raju

Writer
    Next Story