తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు

ఉపరిత ఆవర్తనం, అల్పపీడన ప్రభావం వల్ల తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

heavy rains
X

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది..ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కపల్లిలో అత్యధికంగా 9.12 సెం.మీ వర్షం నమోదైంది.

భద్రాచలంలో 7.33 సెం.మీ, జూలూరుపాడ్‌లో 6.26 సెం.మీ, చంద్రుగొండలో 6.15 సెం.మీ, కొత్తగూడెంలో 5.57 సెం.మీ, చుంచుపల్లిలో 5.32 సెం.మీ, అశ్వాపురంలో 5.51 సెం.మీ, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా జైన్‌పూర్‌లో 5.74 సెం.మీ, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో 5.61 సెం.మీ, ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌లో 6.72 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది జూన్‌ ముగిసేటప్పటికీ 159 మి.మీ. వర్షపాతం నమోదైంది. సోమవారం ఆదిలాబాద్‌, పెద్దపల్లి, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, కొమురంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, జగిత్యాల, మహబూబాబాద్‌, కరీంనగర్‌, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది

Vamshi

Vamshi

Writer
    Next Story