ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్నా పోటీ చేయొవచ్చు : మంత్రి పార్థసారథి

ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

TDP
X

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్లు పోటీకి అనర్హులుగా ఉన్న చట్టాన్ని రద్దు చేస్తూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. మున్సిపాలీటీ, పట్టణాభివృద్ధి , గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉన్న వారు పోటీ చేయవచ్చని మంత్రి పార్థసారథి తెలిపారు.

రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు తగ్గిపోతోందన్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఉన్న చట్టాన్ని రద్దు చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఏపీలో యువ జనాభా తగ్గిపోయే ప్రమాదం నెలకొంది. ఈ సమస్య అంతర్జాతీయంగా కూడా ఉంది. కొన్ని దేశాలు వయోవృద్ధులతో నిండిపోయి ఓల్డ్ ఏజ్ హోమ్స్ గా మారిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి పేర్కొన్నారు.

పట్టాదారు పాస్‌ పుస్తకాలపై ఏపీ ప్రభుత్వ రాజముద్ర ముద్రించనున్నారు. గత ప్రభుత్వం తీసుకున్న విధానాన్ని రద్దు చేస్తూ కొత్తగా ఏపీ రాజముద్రను పాస్‌ పుస్తకాలపై ముద్రించాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. పశు సంవర్థక శాఖ, మత్స్య శాఖలు విడుదల చేసిన జీవో 217, 144 లను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా రిజర్వాయర్‌, చెరువుల్లో బహిరంగ వేలం పాటను రద్దు చేశారు. దీనివల్ల స్థానిక మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని సంబంధిత మంత్రి తెలిపారు.

రాష్ట్రంలో మంజూరైన నూతన వైద్య కళాశాలల్లో 100 సీట్లతో ఎంబీబీఎస్‌ కోర్సులు ప్రారంభం కానున్నాయి. రానున్న అక్టోబర్‌ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీని అమలు చేయాలని, అందుబాటు ధరల్లో నాణ్యమైన మద్యం సరఫరాకు నిర్ణయం తీసుకున్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story