చెరువులను చెరబట్టిన వారిని వదిలేది లేదు : సీఎం రేవంత్‌

హైదరాబాద్‌లో చెరువులను చెరబట్టిన వాళ్ల నుంచి హైడ్రా ద్వారా విముక్తి కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. నగరంలో హరేకృష్ణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అనంత శేష స్థాపన ఉత్సవంలో సీఎం పాల్గొన్నారు

Cm revanth reddy
X

హైదరాబాద్‌లో చెరువులను చెరబట్టిన వాళ్ల నుంచి హైడ్రా ద్వారా విముక్తి కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. నగరంలో హరేకృష్ణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అనంత శేష స్థాపన ఉత్సవంలో సీఎం పాల్గొన్నారు. భవిష్యత్ తరాలు బాగుండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఎవరు ఎన్ని ఒత్తిడులు తెచ్చినా చెరువుల ఆక్రమణదారుల భరతం పడతామని రేవంత్ హెచ్చారించారు. శ్రీకృష్ణుడి భగవద్గీత బోధనానుసారం చెరువులను కాపాడుతున్నామని సీఎం అన్నారు. అధర్మం ఓడాలంటే యుద్ధం తప్పదన్న కృష్ణుడి మాటలు తనకు స్ఫూర్తి అని చెప్పారు.

కోట్లాది మంది దాహార్తిని తీర్చే చెరువుల పరిధిలో విలాసాల కోసం కొందరు ఫామ్ హౌస్ లు నిర్మించుకున్నారు. నగరానికి తాగునీరు అందించే గండిపేట్, హిమాయత్ సాగర్ లోకి ఫామ్ హౌస్ ల నుంచి వ్యర్ధజలాలు వదులుతున్నారని సీఎం తెలిపారు. ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. కబ్జాదారుల చెర నుంచి చెరువులను రక్షిస్తామని వెల్లడించారు. చెరువులను కబ్జా చేసే వారి భరతం పడతామని హెచ్చరించారు. ప్రకృతి సంపదను విధ్వంసం చేస్తే ప్రకృతి ప్రకోపిస్తుందని అన్నారు. చెన్నై, వయనాడ్‌లో ప్రకృతి కోపాన్ని చూశామని గుర్తుచేశారు. భవిష్యత్‌ తరాలకు మనం ప్రకృతి సంపదను అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story