అస్తవ్యస్థంగా మారిన ప్రభుత్వ వ్యవస్థ వల్లే ఈ అవస్థ: కేటీఆర్‌

రాష్ట్రంలో మార్పు కావాలి.. కాంగ్రెస్‌ కావాలని పెద్ద మార్పే తెచ్చారు. కాంగ్రెస్‌ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లలో నెలకొన్న దుర్భర పరిస్థితులపై కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు.

అస్తవ్యస్థంగా మారిన ప్రభుత్వ వ్యవస్థ వల్లే ఈ అవస్థ: కేటీఆర్‌
X

సుల్తాన్‌పూర్‌ జేఎన్‌టీయూ క్యాంపస్‌లో మెస్‌ చట్నీలో చిట్టెలుక చక్కర్లు కొట్టిన ఘటన కలకలం సృష్టించింది. ఇదొక్కటే మొన్న మెదక్‌ జిల్లా కోమటిపల్లి ఆశ్రమ పాఠశాలలో ఉప్మా బల్లిపడి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆ ఇరవై మందిలో ఇప్పటికీ ముగ్గురు ఆస్పత్రిలోచే చికిత్స పొందుతున్నారు. నిన్న జేఎన్‌టీయూ ఘటనపై విద్యార్థులు ఆందోళన చేపట్టగా ప్రిన్సిపాల్‌ బుకాయించే ప్రయత్నం చేశారు. కానీ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా స్పందించి మెస్‌ కాంట్రాక్టర్‌ను తొలిగించాలని ఆదేశించారంటే రాష్ట్రంలోని హాస్టళ్లలో ని మెస్‌లలో ఎంత అధ్వాన పరిస్థితులు ఉన్నాయో తెలుస్తోంది. దీనిపై ఎక్స్‌ వేదికగా స్పందించిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ కాంగ్రెస్‌ సర్కార్‌పై సెటర్లు వేశారు. మార్పు రావాలి. కాంగ్రెస్‌ రావాలి అని చెప్పి పెద్ద మార్పే తెచ్చారని మండిపడ్డారు. నాటి కాంగ్రెస్‌పాలలో ప్రభుత్వ హాస్టళ్లలో పురుగుల అన్నం, నీళ్లు చారు ఉంటే నేటి కాంగ్రెస్‌ పాలనలో బల్లి పడిన టిఫిన్లు, చిట్టెలుకలు తిరిగే చట్నీలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆనాటి కాంగ్రెస్‌ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లలో పురుగుల అన్నం, నీళ్ల చారు ఉండేవి. మార్పు కావాలి.. కాంగ్రెస్‌ రావాలి అని చెప్పి పెద్ద మార్పే తెచ్చారు. నేడు కాంగ్రెస్‌ పాలనలో బల్లిపడిన టిఫిన్లు, చిట్టెలుకలు తిరిగే చట్నీలు దర్శనమిస్తున్నాయి. కోమటిపల్లి హాస్టల్ లో ఉప్మాలో బల్లిపడి 20 మంది విద్యార్థులకు వాంతులయ్యాయి. జేఎస్‌టీయూ హాస్టల్‌లో చట్నీలో చిట్టెలుక దర్శనంతో విద్యార్థుల బెంబేలెత్తిపోయారు. విషాహారం తింటే విద్యార్థుల ప్రాణాలకు గ్యారెంటీ ఎవరు? కేటీఆర్‌ ప్రశ్నించారు. అస్తవ్యస్తంగా మారిన ప్రభుత్వ వ్యవస్థ వల్లనే విద్యార్థులకు ఈ అవస్థ..ఈ అస్వస్థత అని ధ్వజమెత్తారు. ఇకనైనా కాంగ్రెస్‌ సర్కార్‌ కళ్లు తెరవాలని సూచించారు. లేకపోతే.. భావిభారత పౌరుల నిండు ప్రాణాలకే ప్రమాదమని, వైఫల్యాలను సరిచేయకపోతే ఊహించని విషాదమని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Raju

Raju

Writer
    Next Story