ఇది ఆత్మహత్య కాదు.. ముమ్మాటికి ప్రభుత్వ హత్యనే : లింగాల కమల్ రాజు

రైతు భోజడ్ల ప్రభాకర్ కుటుంబాన్ని బీఆర్ఎస్ నేత లింగాల కమల్ రాజు పరామర్శించారు. ప్రభుత్వం 25 లక్షల నష్ట పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Kamaraju
X

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనుచరుల వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న రైతు భోజడ్ల ప్రభాకర్ కుటుంబాన్ని బీఆర్ఎస్ నేత లింగాల కమల్ రాజు పరామర్శించారు. ఇది ఆత్మహత్య కాదు, ముమ్మాటికి హత్యనే ఆయన అన్నారు. బాధిత కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నాయకులను నిందితులను తప్పిస్తున్నారు . డిప్యూటీ సీఎం అనుచరుడు కావడంతో అసలు నిందితుడిని ఏ10గా చేర్చారు పోలీసులు.

తన ఆత్మహత్యకు కారణం కాంగ్రెస్ నాయకుడు కూ రపాటి కిషోర్ అని స్వయంగా రైతు భోజడ్ల ప్రభాకర్ చెప్పినా, ప్రభాకర్ తండ్రి వీరభద్రయ్య ఇచ్చిన ఫిర్యాదులో కిషోర్ పేరు ప్రధానంగా ప్రస్తావించినా.. ఎఫ్ఐఆర్‌లో అతడిని మాత్రం ఏ10గా చేర్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. కాగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న రైతు భోజడ్ల ప్రభాకర్ ఘటనపై స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఈ ఘటనపై విచారణ చేసి కారకులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ గ్రౌండ్‌ స్థాయిలో ఈ పరిస్థితి కనిపించడం లేదు.

Vamshi

Vamshi

Writer
    Next Story