దీన్నే మానవతగల పాలన అంటారు: కేటీఆర్‌

బీఆర్‌ఎస్‌ హయాంలో తెలంగాణ భూములు సస్యశ్యామలం అయ్యాయని, రైతుల జీవితాలు బాగుపడ్డాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు.

దీన్నే మానవతగల పాలన అంటారు: కేటీఆర్‌
X

బీఆర్‌ఎస్‌ హయాంలో తెలంగాణ భూములు సస్యశ్యామలం అయ్యాయని, రైతుల జీవితాలు బాగుపడ్డాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణలో 2015-2022 వరకు రైతుల ఆత్మహత్యలు ఎలా తగ్గుతూ వచ్చాయో తెలిపే గణంకాలకు సంబంధించిన గ్రాఫ్‌ను జూన్‌ 24న అర్వింద్‌ వారియర్‌ అనే ఒక ఎక్స్‌ యూజర్‌ తన ఖాతాలో పోస్ట్‌ చేశాడు.

దేశంలో రైతు ఆత్మహత్యలో 2025లో తెలంగాణ రైతులది 11.1 శాతంగా ఉండేది. అది క్రమంగా తగ్గుతూ 2022 నాటికి 1.57 శాతానికి చేరిందనే విషయాన్ని ఆ గ్రాఫ్‌ స్పష్టం చేస్తున్నది. అర్వింద్‌ వారియర్‌ పోస్టును కోట్‌ చేస్తూ కేటీఆర్‌ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. బీఆర్‌ఎస్‌ పాలనలో రైతుల జీవితాలు ఎలా మెరుగుపడ్డాయో వివరించారు.




2014కు ముందు తెలంగాణ ప్రాంతం దేశంలోని తీవ్ర కరువు కాటలకాలు ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో ఒకటి. సాగునీటి వసతి లేక ఎక్కడ చూసినా బీడు భూములే కనిపించేవి. నాటి ప్రభుత్వాల నిర్లక్ష్యంతో తెలంగాణలో వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతిన్నది. పెట్టిన పెట్టుబడులు కూడా రాక రైతులు అప్పులపాలయ్యేవారు. పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడేవారని కేటీఆర్‌ గుర్తు చేశారు.

కేసీఆర్‌ ప్రభుత్వం చొరవ తీసుకుని, చిత్తశుద్ధితో తెలంగాణలో వ్యవసాయరంగ అభివృద్ధికి కృషి చేసింది. ఫలితంగా వ్యవసాయ రంగం గాడిన పడింది. వ్యవసాయంలో నాణ్యత పెరిగింది. రైతుల జీవితాల్లో వెలుగులు నిండాయి. దీనికి కింది గణాంకాలే నిదర్శనం అన్నారు. ఈ పోస్టుకు 'దీన్నే మానవతగల పాలన అంటారు' అని కేటీఆర్‌ క్యాప్షన్‌ పెట్టారు.

Raju

Raju

Writer
    Next Story