దళిత మహిళపై థర్డ్ డిగ్రీ..పోలీసులపై వేటు

దళిత మహిళను పోలీసులు చితకబాదటంతో సీపీ అవినాష్ మహంతి పలువురిపై చర్యలు తీసుకున్నారు

DALIT
X

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో దళిత మహిళను పోలీసులు చితకబాదటంతో సీపీ అవినాష్ మహంతి పలువురిపై చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రామిరెడ్డితో పాటు ఐదుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏసీపీ రంగస్వామి కమీటీ సమర్పంచే రిపోర్టు ఆధారంగా యాక్షన్ తీసుకోన్నారు.

షాద్ నగర్ పోలీస్ స్టేషన్‌లో సునీత అనే దళిత మహిళపై పోలీసులు క్రూర చర్యకు పాల్పడ్డారు. దొంగతనం కేసులో ఆమెతో పాటు ఆమె భర్త, కుమారుడిని కూడా హింసించారు.బంగారం దొంగించిందనే ఆరోపణలతో ఆమెపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేసినట్లుగా తెలుస్తోంది. రాత్రి సమయంలో ఠాణాకు తీసుకొని వెళ్లి.. కొడుకు ముందే చీర తీసేసి నిక్కర్ తొడిగి లాఠీ ఛార్జ్ చేసినట్లు ఆ మహిళ ఆరోపించింది. దీంతో ఆ విషయం రాష్ట్రవ్యాప్తంగా దుమారంగా మారింది.

Vamshi

Vamshi

Writer
    Next Story