సోనియా, రాహుల్‌కు బెయిల్‌ వచ్చింది.. కాంగ్రెస్‌, బీజేపీ పార్ట్‌నర్స్‌ అనుకోవచ్చా? : కేటీఆర్‌

బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్‌, బీజేపీ చేస్తున్న విమర్శలపై మండిపడిన కేటీఆర్‌

సోనియా, రాహుల్‌కు బెయిల్‌ వచ్చింది.. కాంగ్రెస్‌, బీజేపీ పార్ట్‌నర్స్‌ అనుకోవచ్చా? : కేటీఆర్‌
X

ఢిల్లీ మద్యం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ ఇచ్చింది. దీనిపై బీఆర్‌ఎస్‌, బీజేపీ కుమ్మక్కు కావడం వల్లనే బెయిల్‌ వచ్చిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తే కవితకు బెయిల్‌ రావడం అనేది బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండిండికీ విజయమని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ట్వీట్‌ చేశారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌, బీజేపీ విమర్శలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు ముందు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ పొత్తంటూ కాంగ్రెస్‌ దుష్ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు.

2015లో ఈడీ కేసులో సోనియా, రాహుల్‌కు బెయిల్‌ వచ్చింది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇండియా కూటమి ఆమ్‌ ఆద్మీ పార్టీ చేరింది. ఆ పార్టీ సీనియర్‌ నేత సిసోడియాకు బెయిల్‌ మంజూరైంది.తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఓటుకు నోటు కేసులో 2015 నుంచి బెయిల్‌పైనే తిరుగుతున్నారు.ఎన్టీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వతే ఇవన్నీ జరిగాయి. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌, బీజేపీలు కూడా పార్ట్‌నర్స్‌ అనుకోవచ్చా? అని ప్రశ్నించారు.

Raju

Raju

Writer
    Next Story