మైనారిటీలే లక్ష్యంగా జరుగుతున్న దాడులకు ఐరాస వ్యతిరేకం

ఓ జాతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం , హింసకు పాల్పడటానికి ఐరాస వ్యతిరేకమని స్పష్టం చేసింది.

మైనారిటీలే లక్ష్యంగా జరుగుతున్న దాడులకు ఐరాస వ్యతిరేకం
X

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడులను ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని హింసకు పాల్పడటానికి వ్యతిరేకమని ఐరాస స్పష్టం చేసింది. కొన్నివారాలుగా బంగ్లాదేశ్‌లో జరుగుతున్న హింసను నిరోధించాలని అక్కడి పాలకులకు సూచించినట్లు ఐక్యరాజ్య సమితి అధికార ప్రతినిధి ఫర్హాన్‌ హక్‌ తెలిపారు. ఓ జాతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం , హింసకు పాల్పడటానికి ఐరాస వ్యతిరేకం అన్నారు.

బంగ్లాదేశ్‌లో మైనారిటీలే లక్ష్యంగా జరుగుతున్న దాడులపై ప్రశ్నించినప్పుడు ఆయన ఈ మేరకు స్పందించారు. అవామీ లీగ్‌ అధినేత్రి షేక్‌ హసీనా ప్రధాని పదవి నుంచి తప్పుకుని భారత్‌కు పారిపోవడంతో అల్లరిమూకలు రెచ్చిపోయారు. సోమవారం నుంచి మొదలైన అల్లర్ల సందర్భంగా అనేక ప్రార్థనా మందిరాలు, నివాస ప్రాంతాలు, వ్యాపారాలు ధ్వంసమయ్యాయి. అవామీ లీగ్‌తో సంబంధం ఉన్న ఇద్దరు మైనారిటీ నేతలను కిరాతకంగా చంపేశారు.

Raju

Raju

Writer
    Next Story