ఆ రెండు రోజులు సెలవులిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్వర్వులు

గణేశ్ చతుర్దశి, మిలాద్ ఉన్ నబీ పర్వదినాలను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 7, సెప్టెంబర్ 17 తేదీలను సెలవు దినాలుగా ప్రకటించింది.

ఆ రెండు రోజులు సెలవులిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్వర్వులు
X

గణేశ్ చతుర్దశి, మిలాద్ ఉన్ నబీ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 7,17 సెలవు దినాలుగా ప్రకటిస్తూ సర్కార్ ఉత్వర్వులు జారీ చేసింది. తెలంగాణలో సాధారణ హాలీడే క్యాలెండర్ ప్రకారం 7న గణేశ్ చతుర్థి, సెప్టెంబర్ 16న మిలాద్ ఉన్ నబీకి సెలవులుగా గతంలో నిర్ణయించారు. తొలుత నిర్ణయించిన 16వ తేదీన కాకుండా ఇప్పుడు 17వ తేదీని సెలవు దినంగా ప్రకటించింది.

కానీ నెలవంక దర్శనం తేదీని బట్టి మిలాద్ ఉన్ నబీ సెలవు దినం మార్చినట్లు ప్రభుత్వం తెలిపింది. తొలుత నిర్ణయించిన 16వ తేదీన కాకుండా ఇప్పుడు 17వ తేదీని సెలవు దినంగా ప్రకటించింది. అదే రోజు భాగ్యనగరంలో గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం జరుగనుంది. దీంతో 2 కార్యక్రమాల కోసం హాలీడే ఇచ్చినట్లయింది.

Vamshi

Vamshi

Writer
    Next Story