పోలండ్‌.. ఉక్రెయిన్‌ పర్యటనకు బయల్దేరిన ప్రధాని

ఉక్రెయిన్‌లో శాంతి, స్థిరత్వం త్వరగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధాని మోడీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

పోలండ్‌.. ఉక్రెయిన్‌ పర్యటనకు బయల్దేరిన ప్రధాని
X

ప్రధానమంత్రి నరేంద్రమోడీ పోలండ్‌, ఉక్రెయిన్‌ దేశాల పర్యటనకు బయలుదేరారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ దేశాల్లో పర్యటించనున్నారు.పర్యటనకు ముందు ప్రధాని ఓ ప్రకటనను విడుదల చేశారు. ఉక్రెయిన్‌లో శాంతి, స్థిరత్వం త్వరగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.మధ్య ఐరోపాలో భారత్‌కు పోలండ్‌ కీలక ఆర్థిక భాగస్వామిగా ఉన్నది. ఇరు దేశాల మద్య భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ప్రధాని డోనాల్డ్‌ టస్క్‌, అధ్యక్షుడు ఆండ్రెజ్‌ దూడ నా భేటీ కోసం ఎదురుచూస్తున్నారు.

నేడు, రేపు ప్రధాని పోలండ్‌లో పర్యటిస్తారు. భారత్‌-పోలండ్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మొదలై 70 ఏళ్లు అయిన సందర్భంగా ప్రధాని పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ పర్యటనలో ప్రధాని మోడీ పోలండ్‌ ప్రధాని డోనాల్డ్‌ టస్క్‌, అధ్యక్షుడు ఆండ్రెజ్‌ దూడలో భేటీ కానున్నారు. పోలండ్‌ రాజధాని వార్సాలో ప్రధాని మోడీ అధికారిక స్వాగతం అందుకోనున్నారు. భారత సంతతి ప్రజలు ఏర్పాటు చేసిన కార్యక్రమంఓలనూ మోడీ పాల్గొననున్నారు. 5 వేల మంది విద్యార్థులు సహా మొత్తం 25 వేల మంది పాల్గొనే అవకాశం ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ పర్యటన ముగిసిన అనంతరం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదమిర్‌ జెలెన్‌స్కీ ఆహ్వానం మేరకు కీవ్‌ వెళ్తున్నట్టు ప్రధాని ప్రకటనలో పేర్కొన్నారు. ఆ దేశంలో భారత ప్రధాని చేపట్టబోయే మొదటి పర్యటన ఇదే కానున్నది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడమే ప్రధానాంశంగా ఈ పర్యటన సాగనున్నది. గత రెండేళ్గుగా కొనసాగుతున్న ఉక్రెయిన్‌ వివాదానికి శాంతి యుత పరిష్కారంపై జెలెన్‌స్కీతో నా ఆలోచనలు పంచుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. శాంతి, స్థిరత్వం త్వరగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు మోడీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Raju

Raju

Writer
    Next Story