రానున్న నాలుగేళ్లు అమెరికా చరిత్రలో నిలిచిపోతాయి: ట్రంప్‌

రానున్న నాలుగేళ్లు అమెరికా చరిత్రలో నిలిచిపోతాయని ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఎలాంటి అడ్డంకులు ఎదురైనా అమెరికాను గొప్ప దేశంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

రానున్న నాలుగేళ్లు అమెరికా చరిత్రలో నిలిచిపోతాయి: ట్రంప్‌
X

రానున్న నాలుగేళ్లు అమెరికా చరిత్రలో నిలిచిపోతాయని ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఎలాంటి అడ్డంకులు ఎదురైనా అమెరికాను గొప్ప దేశంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.మిల్వాకీలో జరిగిన పార్టీ చివరి జాతీయ సదస్సు చివరి రోజు అధ్యక్ష అభ్యర్థిగా ఆయనను ఎన్నుకున్న పార్టీ నిర్ణయాన్నిఅధికారికంగా అంగీకరిస్తూ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. తనపై జరిగిన కాల్పుల ఘటనను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

బుల్లెట్‌ సరిగ్గా తన దగ్గరికి వచ్చిన సమయంలో వలస దారులకు సంబంధించిన సమాచారం చూడటం కోసం చాట్‌వైపు చూడటంతో ప్రమాదం తప్పిందన్నారు. దేవుడి ఆశీస్సుల వల్లనే నేడు మీ ముందు నిలబడగలిగాను అంటూ తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్‌ పేర్కొన్నారు. ప్రపంచం ఇంతకు ముందు ఎప్పుడూ చూడని ఉన్నత శిఖరాలకు అమెరికాను తీసుకువెళ్తానని చెప్పారు. గతంలో కొందరు తనకు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా భవిష్యత్తులో తనకు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నట్టు ట్రంప్‌ పేర్కొన్నారు.

Raju

Raju

Writer
    Next Story