ట్రంప్‌పై కాల్పులు చేసిన అనుమానితుడి పేరు థామస్‌ మాథ్యూ

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై కాల్పులకు పాల్పడిన అనుమానితుడి పేరు థామస్‌ మాథ్యూ క్రూక్స్‌గా ఎఫ్‌బీఐ ధృవీకరించింది.

ట్రంప్‌పై కాల్పులు చేసిన అనుమానితుడి పేరు థామస్‌ మాథ్యూ
X

డొనాల్డ్‌ ట్రంప్‌పై కాల్పుల ఘటనపై ఎఫ్‌బీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది.ఘటన ప్రాంతంలో అమెరికా భద్రతా సిబ్బందితో కలిసి ఎఫ్‌బీఐ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నది. ట్రంప్‌పై కాల్పులు చేసినట్లు అనుమానిస్తున్న వ్యక్తి పేరు థామస్‌ మాథ్యూ క్రూక్స్‌ ఎఫ్‌బీఐ ధృవీకరించింది. ఇప్పటికే పలు మీడియా సంస్థల్లో అతని పేరు, ఫొటోలు వైరంగా మారాయి. డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నఅతనికి 20 ఏళ్ల వయసు ఉంటుందని భావిస్తున్నారు.

మరోవైపు బుల్లెట్‌ ట్రంప్‌ కుడి చెవి పై నుంచి వెళ్లడంతో ఈ ఘటనను ఆయనపై హత్యాయత్నంగా అమెరికా మీడియా పేర్కొన్నది. ట్రంప్‌పైకాల్పుల ఘటనను యావత్‌ ప్రపంచం తీవ్రంగా ఖండించింది. ప్రధాని మోడీ సహా అమెరికా మాజీ అధ్యక్షుడు, వ్యాపారవేత్తలు తీవ్రంగా విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి హింసాయుత ఘటనలకు తావులేదని ముక్తకంఠంతో ఖండించారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై జరిగిన కాల్పుల ఘటన అగ్రరాజ్యంలో తీవ్ర కలకలం సృష్టిస్తున్నది. దుండగుడి కాల్పులతో ఆయన చెవికి గాయమైంది. చికిత్స అనంతరం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ట్రంప్‌ పెన్సిల్వేనియా ఎన్నికల ప్రచారం చేస్తుంగా ట్రంప్‌ లక్ష్యంగా ర్యాలీలో అగంతకుడి కాల్పుల్లో ఒకరు చనిపోగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. కాల్పులు జరిపిన దుండగుడిని ట్రంప్‌ భద్రతా సిబ్బంది మట్టుబెట్టింది.

Raju

Raju

Writer
    Next Story