ఎమ్మెల్సీ ఫొటో ఉన్న ఫ్లెక్సీ తొలిగించారు.. ఎందుకంటే

జగిత్యాలలో తన ఫొటో ఉన్న ఫ్లెక్సీ తొలిగింపుపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.

ఎమ్మెల్సీ ఫొటో ఉన్న ఫ్లెక్సీ తొలిగించారు.. ఎందుకంటే
X

జగిత్యాలలో తన ఫొటో ఉన్న ఫ్లెక్సీ తొలిగింపుపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీనిపై ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బోనాల పండుగలో పాల్గొనడానికి వస్తుండగా 8వ వార్డులో మున్సిపల్‌ సిబ్బంది తొలిగిస్తుండగా..జీవన్‌రెడ్డి గమనించారు. ఫ్లెక్సీని ఎవరు తీయమని ప్రశ్నించగా..టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు తీయమంటే తీస్తున్నామని సిబ్బంది సమాధానం ఇచ్చింది. సంబంధిత అధికారులకు ఎమ్మెల్సీ ఫోన్‌ చేసి మండిపడ్డారు.

ఫ్లెక్సీలోని ఉద్యోగుల ఫొటోలకు మాత్రమే మాస్క్‌ వేయాలని మాత్రమే సూచించారని మున్సిపల్‌ అధికారి బదులిచ్చారు. అధికారి సమాధానంతో సంతృప్తి చెందని జీవన్‌రెడ్డి ఈ విషయంపై కలెక్టరుకు ఫిర్యాదు చేస్తానని అన్నారు.

జగిత్యాల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ పార్టీ మారిన నుంచి నియోజకవర్గంలో జీవన్‌రెడ్డికి ప్రాధాన్యం తగ్గుతున్నదనే టాక్‌ వినిపిస్తున్నది. ఆయన రాకను వ్యతిరేకించిన ఎమ్మెల్సీ వర్గీయులు ఇప్పటికీ ఆగ్రహంతోనే ఉన్నారు. కాంగ్రెస్‌లో విపక్ష ఎమ్మెల్యేల చేరికలు ఆపార్టీకి కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా నియోజకవర్గాల్లో అధికారులు ఎవరూ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులను పట్టించుకోవడం లేదంటున్నారు. తాజాగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఫ్లెక్సీ తొలిగింపు వివాదంతో ఈ అంశాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.

Raju

Raju

Writer
    Next Story