చాపకింద నీరులా చంద్రబాబు పార్టీ విస్తరణ

తెలంగాణ ముఖ్యమంత్రికి మాత్రం కలలో కూడా కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ మాత్రమే కనిపిస్తున్నాయి.

చాపకింద నీరులా చంద్రబాబు పార్టీ విస్తరణ
X

తెలంగాణ వలె ఏపీలోనూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల సంగతి ఓడెక్క దాకా ఓడ మల్లన్న ఓడ దిగినాక బోడి మల్లన్న లెక్కనే ఉన్నది. హామీల విషయంలో రెండు రాష్ట్రాల అధికార ప్రభుత్వాలు తీరు ఒకేలా ఉన్నది. ఏపీ సీఎం చంద్రబాబు మెల్లగా ఇక్కడ విస్తరణపై దృష్టి సారించారు.

ఎన్టీఆర్‌ భవన్‌లో పార్టీ నేతలతో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టాలని నాయకులను ఆదేశించారు. పనితీరు బాగున్న వారికే పార్టీలో ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఉన్న అన్ని కమిటీలను చంద్రబాబు రద్దు చేశారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలంగాణలో టీడీపీ బలోపేతానికి కృషి చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఆన్‌లైన్‌లో పార్టీ సభ్యత్వం తీసుకునే ఏర్పాటు చేస్తామని తెలిపారు. యువతక ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. 15 రోజులకు ఒకసారి రాష్ట్రానికి వచ్చేందుకు ప్రయత్నిస్తానన్న బాబు అందరినీ కలిసి అభిప్రాయాలు తీసుకుంటానని తెలిపారు.

అక్కడి సీఎం.. ఇక్కడి సీఎం స్పష్టంగానే ఉన్నారు. విభజన సమస్యల పరిష్కారం కోసం ఆ మధ్య భేటీ అయిన ఇద్దరూ ఇప్పుడు సప్పుడు చేయడం లేదు. కానీ ఏపీ సీఎం పార్టీ విస్తరణ పనిలో పడ్డారు. తెలంగాణ సీఎం హస్తిన టు హైదరాబాద్‌ తిరగడానికే సరిపోతున్నది. రాష్ట్రంలో విష జ్వరాల బారిన పడి తెలంగాణ మొత్తం పడకేసినా పట్టించుకోవడం లేదు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలూ గడిచినా ప్రతీది రేవంత్‌కు రాజకీయమే. రాష్ట్రంలో రైతుల గురించి అవసరం లేదు. మహిళల భద్రత గురించి సమీక్ష చేసే తీరిక లేదు. రుణమాఫీ కాని రైతులు నిత్యం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా దాని గురించి స్పందన లేదు. కానీ నిత్యం ఎక్కడికిపోయినా బీఆర్‌ఎస్‌ను తిట్టాలి. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులను తిడుతూ పబ్బం గడపాలి. సీఎం సారుకు రాష్ట్రంలో ఏం జరుగుతున్నదన్న సోయి కూడా లేదు. బహుశా తన వ్యక్తిగత అజెండాతో పనిచేసే ఆయనకు వీటి గురించి ఎందుకు? కానీ చంద్రబాబు మాత్రం చాపకింద నీరులా మెల్లగా మెల్లగా తన రాజకీయాన్ని ఏపీ నుంచి హైదరాబాద్‌కు మార్చినట్టు కనిపిస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ నాటికి ఆయన తన అజెండాను ప్రకటించే అవకాశం లేకపోలేదు. తొమ్మిది నెలల్లోనే తెలంగాణలో ఎంత మార్పు వచ్చిందో ఆలోచించండి.

Raju

Raju

Writer
    Next Story