సుంకిశాల ప్రాజెక్టు నష్టం కాంట్రాక్టర్ భరిస్తారు : మంత్రి ఉత్తమ్

దక్షిణ తెలంగాణను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

సుంకిశాల ప్రాజెక్టు నష్టం కాంట్రాక్టర్ భరిస్తారు : మంత్రి  ఉత్తమ్
X

దక్షిణ తెలంగాణను మాజీ సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన సంఘటన చిన్నదే నష్టం కూడా తక్కువేనని తెలిపారు. నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో సుంకిశాల వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టులో సైడ్‌వాల్ కూలిన ఘటన పై నల్గొండ జిల్లాలో మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పర్యటించారు. ప్రజలకు, ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలుపై ఆరోపణలు చేశారు. సోషల్ మీడియా ద్వారానే సుంకిశాల ప్రమాదం ప్రభుత్వానికి తెలిసిందని. ఘటన జరగగానే ప్రభుత్వం స్పందించిందన్నారు

జరిగిన సంఘటన చిన్నది.. నష్టం కూడా తక్కువే.. ఆ నష్టాన్ని కాంట్రాక్టర్ భరిస్తారు. ప్రజలకు, ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని మంత్రి ఉత్తమ్ అన్నారు. ప్రాజెక్టు పూర్తి కాలేదు.. నిర్మాణంలో లేదు. నిర్మాణం పూర్తి కావడానికి ఒకటి, రెండు నెలలు పట్టేది. ప్రస్తుతం నిర్మాణం ఆలస్యం కానుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేయలేదు. SLBC ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తాం. డిండి ఎత్తిపోతల పథకం కూడా పూర్తి చేస్తాం. బీఆర్ఎస్ నాయకులు ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదు. సుంకిశాల అన్ని పనులు బీఆర్ఎస్ హయంలోనే జరిగాయి.’ అని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందని ఘటనపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నష్టం అంతా నిర్మాణ సంస్థ భరిస్తుందన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story