సభ్య సమాజం తలదించుకునేలా సీఎం వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సిగ్గూ, లజ్జ లేకుండా సభ్య సమాజం తలదించుకునేలా మాటలు మాట్లాడటం.. సీఎం హోదాలో విదేశాలకు వెళ్లిన రేవంత్‌ భాష, ఆయన వేషం దేశ గౌరవం తగ్గించేలా ఉన్నాయని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు ధ్వజమెత్తారు.

సభ్య సమాజం తలదించుకునేలా సీఎం వ్యాఖ్యలు
X

సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభించిన తర్వాత వైరాలో ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌పై, కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్ రావు,తాత మధులు ఫైర్‌ అయ్యారు. సీఎం వాడిన భాష ప్రజలు సిగ్గుపడేలా ఉన్నదని మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా హాల్‌లో మీడియాతో మాట్లాడారు.

ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నిన్న ఖమ్మం లో మాట్లాడిన తీరు జుగుప్సాకరంగా ఉన్నది, ఆయన భాష తెలంగాణ ప్రజలు సిగ్గుపడేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. . సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభం కు వెళ్లి ఈ భాష ఏమిటి అని ప్రశ్నించారు. కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్ట్ ద్వారా రైతులకు లాభం జరగాలని చూశారు. ఆ ప్రాజెక్ట్ ప్రారంభానికి వెళ్లి రైతులను ఉద్దేశించి మాట్లాడాలి. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సిగ్గూ, లజ్జ లేకుండా సభ్య సమాజం తలదించుకునేలా మాటలు మాట్లాడటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపి, 60 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీని నడుపుతున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు లను ఉద్దేశించి ఇష్టం వచ్చినట్లు సీఎం మాట్లాడారు. ఇచ్చిన హామీలు, రెండు లక్షల ఉద్యోగాలు, రెండు లక్షల రుణం మాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీశ్‌ రావు అన్నారు. చేశారా మరి? అని ప్రశ్నించారు. చేయక పోగా మళ్ళీ మీది నుంచి ఇష్టానుసారంగా హరీశ్‌ను తిడుతున్నారని మండిపడ్డారు.

ఎమ్మెల్సీ తాత మధు మాట్లాడుతూ.. ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. వచ్చిన తెలంగాణ గౌరవంగా ఉండాలని కేసీఆర్‌ కోరుకున్నారు . ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై రైఫిల్‌ ఎక్కుపెట్టి, ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. సీఎం భాష, ఆయన వేషం దేశ గౌరవం తగ్గించేలా ఉన్నాయి. విదేశాలకు వెళ్లి మన దేశం పరువు తీస్తున్నారు. నాలుగుకోట్ల ప్రజలకు మీరు మొదటి ప్రతినిధి. పీసీసీ హోదా లో మీకు నచ్చినట్లు ఉండవచ్చు. కానీ రాష్ట్ర సీఎం హోదా లో ఎలాంటి వేషధారణ ఉండాలి. ముఖ్యమంత్రి స్థాయి దిగజారేల రేవంత్‌ తీరు ఉన్నది. దేశం లోని ఏ రాష్ట్ర సీఎం కూడా విదేశాల్లో ఇలాంటి బట్టలు వేసుకోలేదు. విదేశాలకు వెళ్లి ఎడ్మా బొజ్జు, మందుల శామ్యూల్ గెలిపించుకున్న విషయం చెప్పడానికా? అని నిలదీశారు.

Raju

Raju

Writer
    Next Story