జన్‌ధన్‌ పథకానికి పదేళ్లు: లబ్ధిదారులకు ప్రధాని అభినందనలు

జన్‌ధన్‌ యోజనను విజయవంతం చేసిన వారికి ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసలు కురిపించారు.

జన్‌ధన్‌ పథకానికి పదేళ్లు: లబ్ధిదారులకు ప్రధాని అభినందనలు
X

జన్‌ధన్‌ యోజనను విజయవంతం చేసిన వారికి ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసలు కురిపించారు. ఆర్థిక వ్యవస్థను ప్రజలు చేరేలా ఈ పథకం ముఖ్యపాత్ర పోషించిందని తెలిపారు. జన్‌ధన్‌ పథకానికి పదేళ్లు అయిన సందర్భంగా లబ్ధిదారులందరికీ ప్రధాని అభినందనలు తెలిపారు. కోట్లాది మంది మహిళలు, అణగారినవర్గాలకు గౌరవాన్ని అందించడంలో, ఆర్థిక సమ్మిళితం పెంపొందించడంలో జన్‌ ధన్‌ యోజన ఉపకరించిందని వివరించారు.

2014లో ఇదే రోజు ప్రారంభించిన జన్‌ధన్‌ యోజన దేశంలోని అన్ని కుటుంబాలను సమగ్ర ఆర్థిక వ్యవస్థలోకి తేవడానికి సమీకృత విధానాన్ని అవలంబించిందని పేర్కొన్నారు. ప్రధానిమంత్రి జన్‌ధన్‌ యోజన ప్రపంచంలోనే అతిపెద్ద సమ్మిళిత పథకమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అభివర్ణించారు. పేదలను ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం సహా అట్టడుగువర్గాల ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్నదని ఆర్థిక మంత్రి వివరించారు.

Raju

Raju

Writer
    Next Story