జూనియర్ డాక్టర్లు సమ్మెకు తాత్కాలిక బ్రేక్

సర్కార్‌తో చర్చల అనంతరం సమ్మెను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జూనియర్ డాక్టర్‌లు ప్రకటించారు.

JUDALU
X

తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మెను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో జుడాల వసతి భవనాలకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. జూడాలు సేవలు నిలిపివేసినప్పటికీ మిగిలిన సిబ్బందితో వైద్య సేవలందించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అలాగే జూడాలు తమకు సంబంధించినవి కాకుండా ఇతర సమస్యలు.. అవి కూడా సాధ్యం కానివి డిమాండ్‌ చేస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

కాకతీయ వర్సిటీలో రోడ్ల మరమ్మతులకు నిధులు మంజురు చేస్తామని తెలిపింది. ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని జూడాలు డిమాండ్‌ చేస్తున్నారు. వాస్తవానికి దీనిపై కోర్టులో కేసు నడుస్తోంది. అందుకే వారి సమ్మెను పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు సర్కారీ దవాఖానాల్లో ఓపీ, ఐపీ సేవలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. సమ్మెను తీవ్రతరం చేస్తామని జూడాలు హెచ్చరించారు. అవసరమైతే అత్యవసర సేవలను కూడా బహిష్కరిస్తామని ప్రకటించారు.

Vamshi

Vamshi

Writer
    Next Story