తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ

డిసెంబర్‌ 9న తెలంగాణ విగ్రహం ఆవిష్కరిస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ
X

రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ కార్యకరమంలో సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. డిసెంబర్‌ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటునకు ప్రభుత్వం సంకల్పించింది. 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారు. 2014లో తెలంగాణ ఏర్పాటు కల సాకారమైంది. పదేళ్లు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్నది. తెలంగాణ తల్లి ఏర్పాటును తెరమరుగు చేశారు. తామే తెలంగాణ అనే విధంగా గత పాలకులు వ్యవహరించారు. ప్రగతి భవన్‌లో గడి నిర్మించుకుని పోలీసు పహారా పెట్టారు. గత ప్రభుత్వ విధానాలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యతిరేకమని రేవంత్‌ అన్నారు. ఇందులో భాగంగానే ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చాం. అక్కడే ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే సచివాలయం నుంచే విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు.. కాంగ్రెస్‌ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని సీఎం తెలిపారు.

Raju

Raju

Writer
    Next Story