తెలంగాణ ఇంట‌ర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్‌లో 63.86 శాతం, వొకేష‌న‌ల్‌లో 53.24 శాతం, సెకండియ‌ర్‌లో 43.77 శాతం, వొకేష‌నల్‌లో 51.12 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది.

Inter results
X

తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీలో జనరల్ లో 2,54,498 మంది, ఒకేషనల్ పరీక్షలకు 18,913 మంది హాజరయ్యారు. వీరిలో జనరల్ కేటగిరీలో ఏ గ్రేడ్‌లో 82,910 మంది ఉత్తీర్ణులయ్యారు. బీ గ్రేడ్ లో 40,143 మంది, సీ గ్రేడ్‌లో 24,540 మంది ఉత్తీర్ణులయ్యారు. డీ గ్రేడ్‌లో 14,927 మంది పాసయ్యారు. మొత్తంగా 1,82,520 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 1,06,484 మంది ఇంప్రూవ్‌మెంట్ రాసిన వారున్నారు. 56,036 మంది మార్చి పరీక్షల్లో ఫెయిలై ఇప్పుడు రాసిన వారు ఉన్నారు. అంటే.. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన వారిలో 63.86 శాతం ఉత్తీర్ణత సాధించారు.

మొత్తంగా వార్షిక పరీక్షలు, సప్లిమెంటరీ కలిపి ఇంటర్ ఫస్టియర్లో 3,18,967 మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే 74.1 శాతం ఉత్తీర్ణత నమోదైంది.విద్యార్థులు రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్ కోసమైతే పేపర్ కు రూ. 100 చొప్పున దరఖాస్తు రుసుం ఆన్ లైన్‌లో చెల్లించాలి. రీవెరిఫికేషన్ ఆఫ్ స్కాన్‌డ్ కాపీ ఆఫ్ ఆన్సర్ షీట్ కోసం అయితే పేపర్ కు రూ. 600 చొప్పున చెల్లించాలి. 25వ తేదీ నుంచి 29వ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాల కోసం https://tgbie.cgg.gov.in వెబ్‌సైట్‌ను క్లిక్ చేయొచ్చు.

Vamshi

Vamshi

Writer
    Next Story