వరి ఉత్పత్తిలో అగ్రగామిగా తెలంగాణ : మంత్రి తుమ్మల

Tummala nageswarao
X

వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్‌లో ప్రపంచ వరి సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతు వరి ఉత్పత్తి క్రమంగా పెరుగుతోందన్నారు. రాష్ట్రంలో ఆహార భద్రతకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని తుమ్మల పేర్కొన్నారు. అందరికీ ఆహార భద్రత కల్పన తమ లక్ష్యమని ఆయన తెలిపారు. అందు కోసం కలిసిగట్టుగా కృషి చేస్తున్నామని మంత్రి అన్నారు.

ఈ సీజన్ నుంచి సోనామసూరి పండించే రైతులకు 500 రూపాయల బోనస్ ఉందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 12 మిలియన్ ఎకరాలలో వరి ధాన్యాన్ని పండిస్తున్నారని ఆయన తెలిపారు. తెలంగాణలో 225 వెరైట రైస్ ను పండిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుండి సోనామసూరి, సాంబ మ సూరి, హెచ్ఎంటి ,1010 బాయిల్డ్ , ఐ ఆర్ 64 స్టీమ్ రైస్ వంటి పలు రకాలు ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్ అమెరికా బంగ్లాదేశ్ యునైటెడ్ లండన్ దేశాలకు ఎగుమతులు ఎక్కువగా అవుతున్నాయని ఆయన తెలిపారు. ఈ సదస్సులో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తో పాటు అంతర్జాతీయ కమిటీ సంస్థ ప్రతినిధులు పాల్గోన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story