తెలంగాణ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు జాతీయహోదా ఇవ్వాలి: వినోద్‌కుమార్‌

కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీలు ఈసారి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ రావాల్సిన నిధులు,ప్రాజెక్టులను సాధించాలని వినోద్‌ పేర్కొన్నారు.

తెలంగాణ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు జాతీయహోదా ఇవ్వాలి: వినోద్‌కుమార్‌
X

తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. దీంతో పాటు ఖాజీపేట్ లో రైల్వే కోచ్ ప్యాక్టరీ, బయ్యారం ఉక్కు కార్మాగారం, వెనుకబడిన జిల్లాలకు నిధులు, నవోదయ విద్యాలయాలు ప్రతి జిల్లాకు మంజూరు చేయాలన్నారు. వీటిని సాధించడానికి బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణలు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభకానున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు... ఏపీ విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలపై గత పదేళ్ల కాలంలో దృష్టి పెట్టడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని వినోద్ కుమార్‌ విమర్శించారు. ఈసారి మిత్రపక్షాలపై ఆధారపడి మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ బడ్జెట్‌ మోడీ పరిపాలనకు ఐదేళ్ల పునాది వేస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ కీలకంగా మారింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా తీరంలో రూ. 60వేల కోట్లతో పెట్రో కెమికల్ ప్రాజెక్టుకు క్లియరెన్స్ వచ్చినట్లు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఏపీకి ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు కొంతవరకు నిధుల కేటాయింపులు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 8,కాంగ్రెస్ 8, ఎంఐఎం ఒక స్థానం గెలుచుకున్నది. బీఆర్ఎస్ ఎంపీలుగా తాము ఉన్నప్పుడు చాలా అంశాలను పార్లమెంట్ లో లేవనెత్తి రాష్ట్రానికి రావాల్సినవి సాధించుకున్నామన్నారు. కానీ రాష్ట్రానికి సంబంధించి బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు గత 15 రోజుల నుంచి కేంద్రానికి ఏం వినతిపత్రాలు ఇవ్వలేదన్నారు. ఈ రెండు జాతీయ పార్టీల ఎంపీలు ఈసారి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ రావాల్సిన నిధులు,ప్రాజెక్టులను సాధించాలని వినోద్‌ పేర్కొన్నారు.

Raju

Raju

Writer
    Next Story