స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతోంది. కాలిఫోర్నియాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ, గూగుల్ ప్రధాన కార్యాలయం, జొయిటిస్ కంపెనీని సీఎం సందర్శించారు.

Sridharbabu
X

అమెరికాలో సీఎం రేవంత్‌రెడ్డి బృందం కాలిఫోర్నియాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ, గూగుల్ ప్రధాన కార్యాలయం, జొయిటిస్ కంపెనీని ముఖ్యమంత్రి సందర్శించారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, హెల్త్ కేర్ రంగాల్లో పరస్పర సహకారంపై స్టాన్ ఫోర్డ్ సెంటర్ ఫర్ బయోడిజైన్ సీనియర్ ప్రతినిధులతో సీఎం రేవంత్ బృందం చర్చించింది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ ముందుకొచ్చింది. హెల్త్‌ కేర్‌ రంగంలో భాగస్వామ్యం, కొత్తగా ఏర్పాటు చేయనున్న లైఫ్ సైన్సెస్‌, స్కిల్‌ యూనివర్సిటీలకు మద్దతుతో పాటు.. తెలంగాణ కేంద్రం ఏర్పాటు చేయాలని స్టాన్‌ ఫోర్డ్‌ బయోడిజైన్‌ అధికారులను రేవంత్‌రెడ్డి కోరారు.

రాష్ట్రంలో ఏర్పాటు చేసే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, న్యూ లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీలో భాగస్వామ్యం పంచుకోవాలని ప్రభుత్వం వారిని ఆహ్వానించింది. పరస్పరం అధునాతన పరిజ్ఞానాన్ని పంచుకునే కార్యక్రమాలతో పాటు ఉమ్మడిగా పరిశోధనలు నిర్వహించాలనే అభిప్రాయాలు ఈ సమావేశంలో వ్యక్తమయ్యాయి. తెలంగాణలో స్టాన్‌ ఫోర్డ్ బయోడిజైన్ శాటి లైట్ సెంటర్‌ను ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలపై చర్చలు జరిగాయి. స్టాన్‌ఫోర్డ్ అధ్వర్యంలో జరిగే బయోడిజైన్ ఆవిష్కరణలను రాష్ట్రంలో అకడమిక్, హెల్త్ కేర్ విభాగాలకు అనుసంధానం చేయాలని తన ఆలోచనలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వారితో పంచుకున్నారు.ఈ సమావేశం అనంతరం తెలంగాణ ప్రభుత్వానికి తగిన సహకారం అందిస్తామని యూనివర్సిటీలోని బయోడిజైన్ విభాగం అధిపతులు డాక్టర్ అనురాగ్ మైరాల్, డాక్టర్ జోష్ మాకోవర్ ప్రకటించారు.

Vamshi

Vamshi

Writer
    Next Story