రైతు రుణమాఫీకి తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

రైతు రుణ మాఫీపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన రూ.2 లక్షల రైతు రుణమాఫీకి మంత్రి మండలి తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Cabinet
X

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీకి తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2023 డిసెంబర్ 9కి ముందు తీసుకున్న పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని నిర్ణయించింది. కాగా పంట రుణాల మాఫికి రూ.40 వేల కోట్లు అవసరం ఉంది. ఆగస్ట్ 15వ తేదీలోపు రుణా మాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఛాలెంజ్ చేయడంతో అధికారులు ఆ దిశగా కసరత్తు చేపట్టారు. జూలై చివరి వారం నుండి మాఫీ ప్రక్రియను స్టార్ట్ చేసి రేవంత్ రెడ్డి విధించిన డెడ్ లైన్ ఆగస్ట్ 15 నాటికి రెండు లక్షల మాఫీ ప్రాసెస్‌ను కంప్లీట్ చేసే విధంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story