పార్టీ జెండాను ఆవిష్కరించిన తమిళ దళపతి విజయ్

తమిళగ వెట్రి కళగం పార్టీ చీఫ్‌, తమిళ నటుడు విజయ్‌ ఆ పార్టీ పార్టీ జెండా, గుర్తును ఆవిష్కరించారు.

Vijay
X

తమిళ నటుడు విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీకీ సంబంధించిన జెండా, గుర్తును ఆవిష్కరించారు.తాజాగా గురువారం చెన్నైలో ఎరుపు, పసుపు రంగులో ఏనుగులతో ఉన్న పార్టీ జెండా, గుర్తును ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రంలో ఆయన తల్లిండ్రులు, మద్దతుదారులు, అభిమానులు పాల్గొన్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన కొత్త పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్‌ కసరత్తు చేస్తున్నారు. త్వరలో తిరుచ్చిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు టాక్. తమిళ నేల నుంచి ప్రజల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన వారిని అభినందిస్తాం. కులం, మతం పేరుతో విభేధాలను తొలగిస్తాను..లింగ ప్రాంత బేదాలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తాను అని ప్రమాణం చేశారు.

Vamshi

Vamshi

Writer
    Next Story